జాతీయ వార్తలు

యూపీలో ‘అభినవ సీత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 15: ఓ పక్క దేశవ్యాప్తంగా అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ ప్రతిఒక్కర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతిమ తీర్పు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నాటి జనక మహారాజుకు భూమిలో సీతాదేవి లభించినట్టుగా నేడు కూడా తమ మృతశిశివును ఖననం చేయడానికి వెళ్లి దంపతులకు మూడు అడుగుల లోతులో పాతిన ఓ పెట్టెలో అపర సీతాదేవి లభించింది.
ఇక్కడి ఓ శ్మశానవాటికలో మూడు అడుగుల లోతులోని ఓ పెట్టెలో పెట్టి పాతేసిన ఈ పసిగుడ్డు ఓ జంటకు దొరకడం సర్వత్రా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తమ మృతశిశవును ఈ శ్మశానవాటికలో ఖననం చేసేందుకు వెళ్లిన ఈ దంపతులు కొందరు కార్మికులకు అక్కడ ఉన్న స్థలాన్ని తవ్వుతుండగా ఈ పెట్టె దొరికింది. ఈ పెట్టెను తెరిచిచూస్తే ఇంకా ప్రాణంతో ఉన్న పసిగుడ్డు అందులో కనిపించింది. వెంటనే ఆ బాలికకు పాలు పట్టారు. ప్రస్తుతం బరేళిలోని ఓ స్థానిక ఆసుపత్రిలో ఆ చిన్నారి చికిత్స పొందుతోంది. ఈ దంపతులు తమ మృతశిశువును ఖననం చేయడానికి కొందరు కార్మికులతో రావడం, ఖననం కోసం గొయ్యి తవ్వాలని వారిని కోరడంతో తమకు పెట్టెలో లభించిన ఈ అపర సీతాదేవిని చూసి మురిసిపోతున్నారు. తవ్వుతున్న సమయంలోనే ఆ పెట్టెలో చిన్నారి ఏడుపు కూడా ఆ కార్మికులకు వినిపించింది. వెంటనే దానిని బయటకు తీసి తెరచి చూస్తే సజీవంగా ఉన్న పాప కనిపించింది. కేవలం మూడు రోజుల వయసు కలిగిన ఈ పాప ఒంటిపై చిన్న బట్ట మాత్రమే ఉందని ఈ దంపతులు తెలిపారు. ఎప్పుడైతే ఈ పాప కనిపించిందో పోలీసులకు తెలియజేశామని, ఒక పాల ప్యాకెట్ తెప్పించి పాలు పట్టించామని వారు తెలిపారు. కాగా, ఈ చిన్నారి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హైపోథెరిమియాతో ఈ చిన్నారి బాధపడుతోందని, వెంటనే ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ మూడు రోజుల శిశువుకు సీత అని పేరు పెట్టారు. అయితే, ఈ చిన్నారి ఒక కిలో బరువు మాత్రమే ఉందని, సాధారణంగా రెండున్నర నుంచి 3 కిలోల బరువు ఉంటేనే పసిపిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు అని వైద్యులు తెలిపారు. రెండు మూడు రోజుల క్రితమే ఈ చిన్నారి జన్మించి ఉంటుందని, ఆమెను ఓ పెట్టెలో పెట్టి, మూడు అడుగుల లోతులో పాతేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. అయితే, దీని పక్కనున్న మరో ప్రాంతాన్ని తవ్వడం వల్ల ఈ చిన్నారిని ఉంచిన పెట్టె కొంతమేర దెబ్బతిందని వారు వెల్లడించారు.
*చిత్రాలు.. బయటపడ్డ పెట్టె *ఆసుపత్రిలో చికిత్స