జాతీయ వార్తలు

సంపన్నులకు దోచిపెడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యవత్మాల్, అక్టోబర్ 15: దేశంలోని పలు పారిశ్రామికవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ లౌడ్ స్పీకర్‌గా పనిచేస్తున్నారన్న తన ఆరోపణను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారంనాడు కూడా వినిపించారు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి ఓ జేబుదొంగ వ్యూహానే్న మోదీ అనుసరిస్తున్నారని, వాస్తవ విషయాలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఓ వస్తువును దొంగతనం చేసేటపుడు సదరు వ్యక్తి ప్రజల దృష్టిని మళ్లిస్తాడని, మోదీ వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన రాహుల్ గాంధీ ‘ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం 370 అధికరణ రద్దు గురించి, చంద్రయాన్ ప్రయోగం గురించి మాట్లాడుతున్నారే తప్ప, రైతులు, సామాన్యుల ఇబ్బందుల గురించి, నిరుద్యోగ సమస్య విషయంలోనూ ఎలాంటి ప్రకటన చేయడం లేదు’ అని అన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు చిన్న, మధ్యతరహా వ్యాపారులు, రైతులు, కార్మికులు, పేద ప్రజల వెన్నువిరిచాయని ఆయన విమర్శించారు. మోదీ సర్కారు అధికారంలో ఉన్నంతవరకూ నిరుద్యోగ సమస్య తీరదని, రానున్న ఆరు నెలల కాలంలోనే ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని రాహుల్ తెలిపారు. ఇటీవల కార్పొరేట్ పన్నును రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన రాహుల్ కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించిన కేంద్ర ప్రభుత్వం సమాజంలోని పేద ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు. రేవులు, ఎయిరిండియా, బొగ్గు గనులు, పీఎస్‌యూలను ప్రైవేటీకరించడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాహుల్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ నడిచేది పారిశ్రామికవేత్తల వల్ల కాదని, రైతులు, కార్మికులు, గణనీయంగా ఉన్న మధ్యతరగతి వ్యాపారవేత్తల వల్లేనని రాహుల్ అన్నారు. పేద ప్రజలకు డబ్బులు అందితేనే వారు నిత్యావసరాలను కొనుగోలు చేయగలుగుతారని, ఆ విధంగా డిమాండ్ పెరుగుతుందని ఆయన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్ని ఇవ్వాలంటే తమ పార్టీ ప్రతిపాదించిన ‘న్యాయ్’ తరహా పథకాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు.
*చిత్రం... మహారాష్ట్ర లో యవత్మాల్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ