జాతీయ వార్తలు

వినూత్న సవాళ్లకు దీటైన జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్లను సైనిక దళాలు బలంగా ఎదుర్కొంటున్నాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను సైతం దళాలు దీటుగా ఎదుర్కొన్నాయంటూ ఆయన ప్రశంసించారు. ఆర్మీ ఉన్నత కమాండర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన ఆధీనరేఖ ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దు కార్యాచరణ దళాల దాడులను భారత సైన్యం తిప్పికొట్టిందని, అలాగే జమ్మూకాశ్మీర్‌లోనూ ఉగ్రవాద కార్యకలాపాలను కఠినంగా అణచివేయగలిగిందని రావత్ అన్నారు. ఈనెల 14 నుంచి 19వరకు జరుగుతున్న ఆర్మీ కమాండర్ల సమావేశంలో కాశ్మీర్ సహా అనేక రీతుల్లో ఎదురవుతున్న సవాళ్లను సమీక్షించడంతోపాటు వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే, ఎప్పటికప్పుడు కొత్త రూపంలో ఎదురవుతున్న సంక్లిష్ట పరిస్థితులను సైతం గట్టిగా ఎదుర్కొనేందుకు దీటైన వ్యూహాత్మక ప్రణాళికను కూడా ఈ సందర్భంగా రూపొందిస్తారు. నిర్ణీత కాలవ్యవధిలో ఈ సవాళ్లన్నింటినీ తిప్పికొట్టే రీతిలో ప్రణాళిక రూపకల్పన జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత సైనిక దళాలు వినూత్న రీతిలోనే తమ కార్యదక్షతను ప్రదర్శిస్తున్నాయని ఆర్మీ చీఫ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆర్మీలోని అన్ని స్థాయిల్లోని సైనికులు కూడా అత్యంత కార్యదక్షతతో పాకిస్తాన్ కార్యకలాపాలను తిప్పికొడుతున్నాయని తెలిపారు. అలాగే, జాతీయ భద్రతకు సంబంధించిన అనేక కేసులను కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సైనిక దళాలు, దర్యాప్తు ఏజన్సీలు సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమవుతోందని రావత్ తెలిపారు.
*చిత్రం... మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని డీఆర్‌డీఓ భవన్‌లో నివాళులు అర్పిస్తున్న ఆర్మీ చీఫ్ రావత్