జాతీయ వార్తలు

25 వేల హోంగార్డులకు ఎసరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 15: హోం గార్డులకు దినసరి వేతనాన్ని పెంచాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ససేమిరా అంటోంది. అంతేకాదు రాష్ట్రంలోని 25 వేల హోం గార్డుల సేవలను ఇకమీదట ఉపయోగించుకోరాదన్న నిర్ణయం తీసుకుంది. యూపీలోని హోం గార్డులకు ప్రతి రోజూ రూ.500 దినసరి వేతనంగా చెల్లిస్తున్నారు. ఉద్యోగానికి హాజరైన రోజే చెల్లిస్తారు. ఈ హోం గార్డులను ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో నియమించింది. కాగా హోం గార్డుల దినసరి వేతనాన్ని రూ.500 నుంచి 672కు పెంచాల్సిందిగా సుప్రీం కోర్టు జూలైలో ఆదేశించింది. కోర్టు తీర్పుతో ప్రతి నెలా ప్రభుత్వంపై 10 నుంచి 12 కోట్ల రూపాయల భారం పడుతున్నది. ఈ నేపథ్యంలో అసలు హోం గార్డుల సేవలను వినియోగించుకోరాదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. హోం గార్డుల సేవలను ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీసు స్టేషన్లలో వినియోగించుకోరాదని నిర్ణయం తీసుకున్నది. హోం గార్డులు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, నెలవారీ వేతనం ఉండదని, విధులకు హాజరైతేనే ఆ రోజున వేతనం చెల్లించడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు వారి సేవలను 15 రోజులకు ప్రభుత్వం కుదించిందని యూపీ డీజిపీ ఒపీ సింగ్ తెలిపారు. అవసరమైనప్పుడే వారిని పిలిపించాలని ప్రభుత్వం భావిస్తున్నది.