జాతీయ వార్తలు

నలుగురు మంత్రులకు మొండిచేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 15: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్లకే టికెట్లు ఇవ్వకుండా పక్కన బెట్టేశారు. ఈనెల 21న రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సీనియర్ మంత్రులకూ బీజేపీ టికెట్లు ఇవ్వలేదు. నలుగురు మంత్రులు ఏక్‌నాథ్ ఖడ్సే, వినోద్ తవాడే, చంద్రశేఖర్ బవాంకులే, ప్రకాశ్ మెహతాకు అధిష్ఠానం టికెట్లు నిరాకరించింది. బవాంకులే, తవాడే రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. ఫడ్నవీస్ కేబినెట్‌లో విద్య, విద్యుత్ మంత్రులుగా ఉండేవారు. అలాగే ఖడ్సే, మెహతా రెవిన్యూ, గృహ నిర్మాణ మంత్రులుగా ఉండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరిందర్నీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూరంగా ఉంచింది. నలుగురు సీనియర్ మంత్రులకు టికెట్లు నిరాకరించడాన్ని బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమర్ధించుకున్నారు.‘అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది. వారికి టికెట్లు నిరాకరించడం ద్వారా అవినీతిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పార్టీ దూరంగా పెట్టింది’అని నడ్డా పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత నడ్డా మీడియా మాట్లాడారు. తమ పార్టీ అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని ఆయన వెల్లడించారు.