జాతీయ వార్తలు

రాజ్యాంగాన్ని మారిస్తే రక్తపాతమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 14: రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించినా, రాజ్యాంగ స్పూర్తిని దెబ్బ తీసినా దేశంలో రక్తపాతం జరుగుతుందని కాంగ్రెస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మైసూర్, టి.నర్సిపురలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం సిద్దరామయ్య లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య పార్టీ కార్యకర్తలను, అక్కడ గుమికూడిన ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ దళితులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకూ మేలు చేకూరేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. ఒక్క దళితులకే కాకుండా సమాజంలో అణచి వేతకు గురవుతున్న వారికి దారి చూపించేలా రాజ్యాంగాన్ని రచించారని ఆయన తెలిపారు. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా మార్చే ప్రయత్నం చేస్తే దేశంలో రక్తపాతం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. అన్ని వర్గాలకూ న్యాయం, సమానవకాశాలు కల్పించేలా రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. అన్ని వర్గాలకూ సమానవకాశాలు కల్పించేలా, అందరికీ న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించినందున కొంత మందికి నచ్చడం లేదని సిద్దరామయ్య విమర్శించారు. అట్టడుగున ఉన్న పేదలకు న్యాయం జరిగేలా అవకాశాలు కల్పించాలని రాజ్యాంగంలో పేర్కొన్నందున కొంత మందికి ఇష్టం లేక వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. రెండేళ్ళ క్రితం కర్నాటక బీజేపీ ఎంపీ అనంత కుమార్ హెగ్డే రాజ్యాంగ సవరణ గురించి చేసిన వ్యాఖ్యలను సిద్ద రామయ్య ఈ సందర్భంగా ఉటంకించారు.
*చిత్రం... కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య