జాతీయ వార్తలు

సంపన్నుల లౌడ్ స్పీకర్ మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూహ్ (హర్యానా), అక్టోబర్ 14: ధనిక వ్యాపారవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ లౌడ్ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తొలిసారి ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన ‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదానీ, అంబానీలకు లౌడ్‌స్పీకర్‌గా మారారు.
కేవలం ధనిక వ్యాపారవేత్తల గురించే మాట్లాడతారు. పేదలను దోచి, సంపన్నులైన తన మిత్రుల జేబులు నింపారు’ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా పేదలను విస్మరించారని, మోదీ తరహాలోనే సంపన్నుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. అలాగే మీడియాను కూడా విమర్శించిన రాహుల్ ‘రాఫెల్ యుద్ధ విమానానికి సంబంధించిన పూజలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఈ యుద్ధ విమానం కొనుగోలు వెనుక జరిగిన కుంభకోణాన్ని మాత్రం వెలుగులోకి తేవడం లేదు’ అని పేర్కొన్నారు. జాతీయవాదులుగా తమను తాము అభివర్ణించుకుంటున్న మోదీ, ఖట్టర్ ప్రభుత్వరంగ సంస్థలను వీరికి ఎందుకు ధనిక వ్యాపారవేత్తలకు ఎందుకు కట్టబెడుతున్నారని రాహుల్ ప్రశ్నించారు. 5.50 లక్షల కోట్ల రూపాయలు సంపన్నుల బకాయిలను ప్రధాని మోదీ మాఫీ చేశారని పేర్కొన్న రాహుల్ మీడియా కూడా వాస్తవాలను వెలుగులోకి తేవడం లేదని అన్నారు. కులం, మతం, ప్రాంతాల వారీగా నాటి బ్రిటీష్ పాలకుల తరహాలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశాన్ని ముక్కలు చేస్తున్నాయని రాహుల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిఒక్కరికీ సంబంధించినది అని, ప్రజలను ఏకం చేయడమే దీని ఆశయమని ఉద్ఘాటించిన రాహుల్ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం నాటి బ్రిటీష్ పాలకుల తరహాలోనే వ్యవహరిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కట్టాలని రాహుల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇప్పటివరకు జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని, అధికారంలోకి వస్తే హర్యానా ప్రజలకు చేసిన వాగ్దానాలను కూడా అమలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హర్యానాల్లో తమ పార్టీ ప్రభుత్వాల పనితీరును రాహుల్ ప్రస్తావించారు. ఎన్నికల వేదికలపై చెప్పే మాటలను తమ పార్టీ త్రికరణశుద్ధిగా అమలు చేస్తుందని ఆయన అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని పేర్కొన్న రాహుల్ మళ్లీ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్ని ఇవ్వాలంటే పేదలు, రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాల్సి ఉంటుందని అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ‘న్యాయ్’ పథకమే ఇందుకు సరైన మార్గమని రాహుల్ తెలిపారు.
*చిత్రం... హర్యానాలోని నూహ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఠాహుల్ గాంధీ