జాతీయ వార్తలు

యూపీలో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావు(యూపీ): యూపీలో గ్యాస్ సిలెండర్ పేలి 13 మంది మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. యూపీలోని మావుపట్టణానికి చెందిన వాలిద్‌పుర ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్ లీకై ఈ విస్ఫోటనానికి దారితీసిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ఇంటినే ఆనుకుని ఉన్న రెండు భవనాలు దెబ్బతిన్నాయి. గ్యాస్ సిలెండర్ పేలుడు శబ్ధం ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితిని సృష్టించింది. ఏదో ఉపద్రం జరిగిందని భావించిన స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఛోటూ విశ్వకర్మ ఇంట్లో ఈ ఘోర ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. విశ్వకర్మ పదేళ్ల క్రితమే చనిపోయాడు. ప్రస్తుతం ఇంట్లో అతడి భార్య, ఐదుగురు కుమార్తెలు ఉంటునట్టు పోలీసులు చెప్పారు. విశ్వకర్మ ముగ్గురు కుమార్తెలు మోనా(20), మమత(18), సంజనా(15) సంఘటన మృతి చెందారు. మిగతా కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియరాలేదు. గ్యాస్ సిలెండర్ లీకేజీ వల్లే పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నట్టు శాంతి భద్రతల ఐజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇంటి కప్పు కుప్పకూలిపోయిందని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన ఇంటిని ఆనుకుని ఉన్న మరో రెండిళ్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని మావుఎస్పీ అనురాగ్ ఆర్య చెప్పారు. కన్హయ్య విశ్వకర్మ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మిగతా బాధితులను గుర్తించాల్సి ఉందన్నారు. రీనా, సరిత, సోనమ్, సింపీ చనిపోయారని వీరందరూ కన్హయ్య కుటుంబ సభ్యులని ఎస్పీ చెప్పారు. అలాగే విశ్వకర్మ సమీప బంధువుసురేంద్ర, అతడి కుమార్తె నిధి(10) పేలుళ్లలో చనిపోయారు. ఇంతియాజ్(25), జెహ్‌సీన్(15), యాసిర్(13), శివం మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ 15 మందికి ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. గ్యాస్ సిలెండర్ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావు కలెక్టర్, ఎస్పీలను హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని యోగి ఆదేశించినట్టు అదనపుచీఫ్ సెక్రెటరీ(హోం) అవనీష్ అవస్థీ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిలెండర్ పేలుడుకు ఓ ఇల్లు పూర్తిగా నేలకూలిందని మంత్రి అనిల్ రాజభార్ తెలిపారు. బాధితులను అన్ని విధానాల ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. శిథిలాల తొలగించడానికి క్రేన్లు, గ్యాస్ కట్టర్లు వాడుతున్నారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎస్ బృందాలు కూడా సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి.
*చిత్రం... ఉత్తరప్రదేశ్‌లోని వౌ జిల్లాలో సోమవారం సిలిండర్ పేలిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యం