జాతీయ వార్తలు

సహకార విస్తరణపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: భారత్‌లో ఐదు రోజుల పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ రాజు విలియమ్ అలెగ్జాండర్, రాణి మాగ్జిమాతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విస్తృత చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. 2013లో నెదర్లాండ్స్ రాజుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అలెగ్జాండర్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. ఈ చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్థితిగతులను సమీక్షించడంతోపాటు మరింతగా ఇతర రంగాలకు సహకారాన్ని విస్తరించుకునే అంశంపైన నెదర్లాండ్స్ రాజు దంపతులతో మోదీ చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో ఈ రాజ దంపతులకు సాంప్రదాయక స్వాగతం లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యాలు గణనీయంగా పెరిగాయి. 2018-19 లో ద్వైపాక్షిక వాణిజ్య టర్నోవర్ 12.87 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్‌లో అత్యధిక స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్‌కు ఐదో స్థానం ఉంది. అలాగే ఈ ఐరోపా దేశంలో 2.35 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.
కాగా, భారత్ పర్యటనలో భాగంగా ఈ రాజ దంపతులు ముంబయి, కొచ్చిలను సందర్శిస్తారు. మంగళవారం 25వ టెక్నాలజీ శిఖరాగ్ర ప్రారంభ సదస్సులో వీరు పాల్గొంటారు. ఈ సదస్సులో దాదాపు 140 మంది నెదర్లాండ్స్ పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు.
*చిత్రం...భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ రాజు విలియమ్ అలెగ్జాండర్, రాణి మాగ్జిమా దంపతులతో సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు