జాతీయ వార్తలు

భారత్‌కు జేఎంబీ ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌కు జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) ఉగ్ర ముప్పు పొంచి ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) హెచ్చరించింది. దేశంలో విస్తరించడానికి జేఎంబీ ప్రయత్నిస్తోందని ఎన్‌ఐఏ చీఫ్ వైసీ మోదీ సోమవారం ఇక్కడ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 125 మంది అనుమానితులతో జేఎంబీ సంబంధాలు నెరపుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) అధిపతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘దేశంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు జేఎంబీ ప్రయత్నిస్తోంది. జార్ఖండ్, బిహార్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ వలసవాదులతో సంబంధాలు నెరపుతున్నారు’అని మోదీ హెచ్చరించారు. జేఎంబీ కార్యకలాపాలపై ఎన్‌ఐఏ దృష్టి సారించిందని, 125 మంది ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్టు వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. జేఎంబీ విచ్ఛిన్నకర కార్యకలాపాలపై ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్ జనరల్ అలోక్ మిట్టల్ వివరాలు అందించారు. ఎవరెవరు సంబంధాలు నెరపుతున్నదీ ఆయా రాష్ట్రాల అధికారులతో ఆరాతీసినట్టు వెల్లడించారు. 2014-18 మధ్య జేఎంబీ బెంగళూరులో ఇరవైకి పైగా రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచి దక్షిణాదిలో తమ ఉగ్ర కార్యకలాపాలు విస్తరించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కర్నాటక సరిహద్దులోని కృష్ణగిరి పర్వత శ్రేణుల్లో రాకెట్ లాంఛర్లను పరీక్షించినట్టు ఎన్‌ఐఏ చీఫ్ మోదీ వెల్లడించారు. మైన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై దాడులకు ప్రతికారంగా బౌద్ధారామాలపై తెగబడేందుకు జేఎంబీ ప్రయత్నించినట్టు మిట్టల్ స్పష్టం చేశారు. 2007లో భారత్‌లో జేఎంబీ కార్యకలాపాలు తొలిసారిగా ప్రారంభమైనట్టు ఆయన చెప్పారు. తొలుత పశ్చిమ బెంగాల్, అస్సాంకే పరిమితమైన ఉగ్ర చర్యలు దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నించినట్టు విచారణలో తేలిందని ఆయన అన్నారు. జేఎంబీతో 130 నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడైందని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా అరెస్టు చేసిన 127 మంది మిలిటెంట్లకు అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నట్టు అంగీకరించారని ఆయన ప్రకటించారు. ఇస్లాం ఆధ్యాత్మిక గురు జకీర్ నాయక్, శ్రీలంకలో ఈస్టర్ రోజు ఉగ్రదాడికి సూత్రధారి వౌల్వీ జహ్రా న్ హష్మీ వీడియో ప్రసంగాలకు ఆకర్షితులైనట్టు నిందితులు వెల్లడించినట్టు ఎన్‌ఐఏ తెలిపింది.
*చిత్రం...ఎన్‌ఐఏ చీఫ్ వైసీ మోదీ