జాతీయ వార్తలు

హైదరాబాద్‌కు మరో మణిహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టూ మరో ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని వివిధ రోడ్ల కేటాయింపునకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా ఆంగీకరించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రశాంత్ రెడ్డి సోమవారం నితిన్ గడ్కరీని కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన వివిధ రోడ్డు ప్రాజెక్టుల గురించి చర్చించారు. తాను చెప్పినదంతా సావకాశంగా విన్న గడ్కరీ పలు ప్రాజెక్టుల పట్ల సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్ర రాజధాని చుట్టూ ప్రస్తుతం ఉన్న రింగ్ రోడ్డు సరిపోవటం లేదు.. పెరుగుతున్న వాహనాల రాకపోకలను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ రింగు రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదన పట్ల నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని ప్రశాంత్ రెడ్డి విలేఖరులకు చెప్పారు. దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఐదారు రోడ్ల నిర్మాణం, నాలుగు నుండి ఆరు రోడ్లకు విస్తరించటం తదితర పనుల పట్ల గడ్కరీ సానుకూలత వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. 44వ నంబర్ జాతీయ రహదారికి సంబందించి హైదారాబాదు-బెంగళూరు సెక్షన్‌లో 22.300 కిలోమీటర్ల నుండి 34.140 కిలోమీటర్ వరకు రూ.309కోట్ల వ్యయంతో జియో మెట్రిక్ అభివృద్ధి పనులు చేపట్టడం, నాగపూర్-హైదరాబాద్ సెక్షన్‌లో 454 నుండి 471 కిలోమీటరు వరకు రూ.706కోట్ల ఖర్చుతో జియో మెట్రిక్ అభివృద్ధి పనులు చేపట్టడం, 472 కిలోమీటర్ వద్ద గుండ్ల పోచంపల్లి నుండి 481 కిలోమీటర్ అంటే బోయిన్‌పల్లి వరకు రూ.447 కోట్ల వ్యయంతో నాలుగు లైన్లను ఆరు లైన్లు చేయటం పనుల పట్ల నితిన్ గడ్కరీ సానుకూలంగా ఉన్నారని అన్నారు. భారత్‌మాల పథకం కింద అప్పా జంక్షన్ నుండి మనె్నగుడ వరకు, కోదాడ నుండి ఖమ్మం వరకు రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయటం.. 161-బీబీ నంబర్ జాతీయ రహదారికి సంబంధించిన మిస్సింగ్ లింక్, బోధన్-రద్రూర్-మద్నూర్ వరకు రోడ్డును అభివృద్ధి చేయటం, జాతీయ రహదారి 161-ఏఏ కింద సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-చౌటుప్పల్ ఓఆర్‌ఆర్ నిర్వహణకు నిధులు కేటాయించటం గురించి కేంద్ర మంత్రితో చర్చించినట్లు ప్రశాంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ చుట్టూ ప్రాంతీయ రింగురోడ్డు (రీజినల్ రింగ్ రోడ్) నిర్మాణానికి అనుమతి కోరినట్లు మంత్రి చెప్పారు.
హైదరాబాద్-వలిగొండ-తొర్రూర్-మహబూబ్‌నగర్-ఎల్లందు, మెదక్-ఎల్లారెడ్డి-రుద్రూర్ వరకు, బోధన్-బాసర-బైంసా వరకు, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి వరకు, చౌట్‌పల్లి-షాద్‌నగర్-కంది వరకు గల రోడ్లను జాతీయ రోడ్డుగా ప్రకటించాలని నితిన్ గడ్కరీని కోరినట్లు ప్రశాంత్ రెడ్డి
చెప్పారు. 2019-20 సంవత్సరానికిగాను జాతీయ రహదారుల ప్రతిపాదిత ప్రణాళికను మంజూరు సీలింగ్‌ను పెంచాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఒక దేశం ఒక పన్ను విధానం కింద టోల్ ప్లాజాలను ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజాలుగా తీర్చిదిద్దుతాం.. ఎలక్ట్రానిక్ విధానం గురించి అందరికీ అవగాహన కలిగేంత వరకు కొన్ని టోల్ కేంద్రాలను హైబ్రీడ్ టోల్ కేంద్రాలుగా తయారు చేస్తామని అన్నారు. టోల్ ప్లాజాలను ఎలక్ట్రానిక్ వ్యవస్థలోకి మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి అదనంగా 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను ఇచ్చేందుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 1380 కిలోమీటర్లకు కేంద్రం నంబరింగ్ కూడా ఇచ్చిందని.. మిగతా కిలోమీటర్లకు కూడా వెంటనే నంబరింగ్ ఇవ్వాలని నితిన్ గడ్కరీని కోరినట్లు ఆయన చెప్పారు.
*చిత్రం...తెలంగాణలో రోడ్డు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి గడ్కరీకి వివరిస్తున్న ఆ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి