జాతీయ వార్తలు

ఈ ప్రశ్నలేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 13: ‘‘మహాత్మా గాంధీ ఆత్మహత్య చేసుకొన్నారా? ఈ మాట వింటే భారతీయులెవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.. 1948 సంవత్సరం జనవరి 30వ తేదీన గాంధీని గాడ్సే కాల్చి చంపిన సంగతే మనకు తెలుసు.. అలాంటిది మహాత్ముడు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటా? అని ఎవరైనా ఠక్కున ముక్కున వేలేసుకోక తప్పదు. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం ఇచ్చిన ప్రశ్నాపత్రంలో ఇలాంటి ప్రశ్న వేసి గందరగోళానికి తెరలేపింది. తొమ్మిదో తరగతి విద్యార్థులకు శనివారం నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో ‘గాంధీజీ ఏ రకంగా ఆత్మహత్య చేసుకొన్నారు’ అంటూ ప్రశ్నను సంధించడంతో షాక్‌కు గురికావడం వారి వంతైంది’’. ‘గాంధీజీయే ఆప్‌ఘాత్ కర్వా మాతే షుకర్యూ?’ (గాంధీజీ ఏ విధంగా ఆత్మహత్య చేసుకొన్నారు) అంటూ గాంధీనగర్‌కు చెందిన సుఫలాం శాలా వికాస్ సంకుల్ అనే విద్యా సంస్థ తొమ్మిదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన అంతర్గత పరీక్షలో పేర్కొన్నట్లు విద్యా శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ స్కూలు నిర్వహణకు ప్రభుత్వం సైతం నిధులను అందిస్తోంది. అలాగే, ఇదే పాఠశాల యాజమాన్యం పరీక్షలో మరో ప్రశ్న సైతం వేసి జనాన్ని డైలమాలో పడేసింది. 12వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలో ‘మీ ప్రాంతంలోని మద్యం అమ్మకాలు చట్ట వ్యతిరేకంగా నడుస్తూ మీకు విసుగు తెప్పిస్తున్నాయా?’ అంటూ వేసిన పరీక్ష కూడా అయోమయానికి గురిచేసింది. ఈ ప్రశ్నలేమిటి? గోల ఏమిటి? అనుకొంటూ జిల్లా పోలీసు యంత్రాంగానికి సైతం ఫిర్యాదులు రావడం గమనార్హం. ‘శనివారం తొమ్మిది, 12వ తరగతి విద్యార్థులకు వేసిన ఇలాంటి ప్రశ్నలు చాలా అభ్యంతరకరం.. దీనిపై విచారణ నిర్వహించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటాం’ అని జిల్లా విద్యా శాఖాధికారి భరత్‌వధర్ మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ ప్రశ్నలకు పాఠశాల యాజమాన్యానిదే బాధ్యతనీ.. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని డీఈవో స్పష్టం చేశారు.