జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో 70వ రోజూ స్తంభించిన జనజీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 13: ‘ఉగ్రవాదులకు భయపడకండి.. స్వేచ్ఛగా జీవనం సాగించండి’ అంటూ ప్రభుత్వం దినపత్రికల్లో ప్రకటనలు చేస్తున్నా కాశ్మీర్ పరిస్థితిలో ఎలాంటి మార్పు చోటుచేసుకోవడం లేదు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసి ఆదివారానికి 70 రోజులైంది. అయినప్పటికీ ఎక్కడా పరిస్థితిలో మార్పు లేదు.. రోడ్లపైకి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. యథావిధిగా మార్కెట్లు తెరుచుకోలేదు.. ప్రజా రవాణా సైతం ఎక్కడా జాడ లేదు.. దీంతో ఎప్పటిలాగే ప్రజలు అవస్థలు పడ్డారు. అయితే, స్థానికంగా వారం వారం నిర్వహించే ‘సండే మార్కెట్’ మాత్రం ఓపెన్ అయింది. పలువురు స్కాళ్లను ఏర్పాటు చేసి నిత్యావసరాలతో పాటు ఫ్యాన్సీ తదితర అమ్మకాలను సాగించారు. టీఆర్‌సీ చౌక్-లాల్‌చౌక్ రోడ్డులో మార్కెట్ నడవడంతో జనం ఒక్కసారిగా నిత్యావసరాల కోసం ఎగబడ్డారు. దీంతో మార్కెట్ జనంతో కిక్కిరిసిపోయింది. శీతాకాలం సమీపిస్తుండడంతో బట్టల షాపులు కిటకిటలాడుతూ కనిపించినట్లు అధికార వర్గాలు వెల్లడించారు. అయితే, కాశ్మీర్‌లో మరెక్కడా షాపులు తెరుచుకున్న దాఖలాలు కనిపించలేదు. కొన్ని చోట్ల కేవలం ఉదయం పదిన్నర వరకు మాత్రమే తెరిచి అనంతరం మూసివేశారు. ఆటో రిక్షాలు, క్యాబ్‌లు అక్కడక్కడా తిరిగాయే తప్ప ప్రజా రవాణా మాత్రం ఎక్కడా జాడలేదు. శనివారంతో పోలిస్తే ఆదివారం క్యాబ్‌లు, ఆటో రిక్షాలు సైతం తక్కువగానే కనిపించినట్లు అధికారులు చెప్పారు. హంద్వారా, కుప్వారా ప్రాంతాలు తప్ప ఆగస్టు నాలుగో తేదీ రాత్రి ఇంతవరకు ఎక్కడా మొబైల్ ఫోన్‌లు పనిచేసిన దాఖలాలు లేవు. ఇంటర్నెట్ సర్వీసులు కూడా ఎక్కడా పునరుద్ధరించకపోవడంతో సమాచార వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి పోస్టుపెయిడ్ మొబైల్ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. దీంతో 99 శాతం మొబైల్ సర్వీసులు కాశ్మీర్ వ్యాప్తంగా పునరుద్ధరించినట్లు అవుతుందని ఆయన చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ద్వితీయశ్రేణి రాజకీయ నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగుతూనే ఉంది. పలువురు ప్రముఖుల అరెస్టుల పర్వం సైతం నిరాటంకంగా సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ప్రధాన నేతల గృహ నిర్బంధంలోనే ఉన్నారు. పలువురు నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది.