జాతీయ వార్తలు

ప్లాస్టిక్ ప్యాకింగ్‌లకు స్వస్తి పలకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ప్లాసిక్ వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలని ఈ కామర్స్ కంపెనీలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి వాడిపడేసే ప్లాస్టిక్‌కు స్వస్తి చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈమేరకు నిర్ణయించింది. ఈ-కామర్స్ కంపెనీలు క్రమంగా ఒకసారి వాడే ప్లాస్టిక్ ప్యాకేజీలను సైతం తగ్గించుకోవాలని ఆదివారం కోరింది. ఈ-కామర్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్లాస్టిక్ వినియోదారులకు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్లాస్టిక్ వినియోగంపై అనుసరిస్తున్న విధానం స్పష్టం చేసేందుకు మంచి స్థిరమైన ప్యాకేజీ మెటీరియల్‌ను వినియోగించాలని జాతీయ పారిశ్రామికాభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐఐటీ) సైతం ఈ-కామర్స్ కంపెనీలను కోరింది. ప్రధానంగా 40 శాతం నాన్‌ఫైబర్ ప్లాస్టిక్ ప్యాకింగ్‌లను ఆపేయాలని కోరింది.