జాతీయ వార్తలు

మోదీది గొప్ప సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్హాపూర్, అక్టోబర్ 13: గత ఏడు దశాబ్దాలుగా భారత ప్రజలు కన్న కలలు ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇన్ని దశాబ్దాల కాలంలో కేంద్రంలో వచ్చిన ఏ ప్రభుత్వమూ తీసుకోని సాహసోపేత నిర్ణయాన్ని నరేంద్ర మోదీ తీసుకున్నారని, 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేసి కాశ్మీర్‌ను పరిపూర్ణంగా భారత్‌లో విలీనం చేశారని ఆయన అన్నారు. కొల్హాపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన అమిత్ షా ఈ నిర్ణయంపై కాంగ్రెస్, ఎన్సీపీల తీరును విమర్శించారు. 370 అధికరణం రద్దుపై ఈ రెండు పార్టీల నేతలను నిలదీయాలని ఆయన ప్రజలను కోరారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ 370 అధికరణను రద్దు చేయడం ద్వారా ఏడు దశాబ్దాల అనిశ్చితికి స్వస్తిపలికి కాశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో విలీనం చేశారని ఆయన అన్నారు. జన్‌సంఘ్ రోజుల నుంచి కూడా భారతదేశానికి ఇద్దరు ప్రధానమంత్రులు ఉండకూడదనే తాము వాదిస్తూ వచ్చామని, అలాగే రెండు రాజ్యాంగాలకు ఆస్కారం ఉండకూడదని గట్టిగా భావించామని ఆయన తెలిపారు. అయితే, 370 అధికరణను తీసుకురావడం ద్వారా భారత్‌లో కాశ్మీర్ విలీనాన్ని కాంగ్రెస్ నాయకత్వం అడ్డుకుందని ఆయన ధ్వజమెత్తారు. 2014లో మోదీ దేశ ప్రధాని అయ్యేవరకు కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయని, ఎందరో ప్రధానులు వచ్చారని గుర్తుచేసిన అమిత్ షా కానీ ఎవరు కూడా 370 అధికరణను రద్దు చేసే సాహసం చేయలేదని అన్నారు. ‘56 అంగుళాల ఛాతీ కలిగిన వ్యక్తే ఈ ధైర్యాన్ని కనబరిచారు. 370 అధికరణను రద్దు చేశారు’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఎందరో సైనికులను హతమార్చినా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆయన అన్నారు. ఎప్పుడైతే ఉరి, పుల్వామా దాడులు జరిగాయో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారని, వైమానిక, లక్షిత దాడులు జరిపి తీవ్రవాద శిబిరాలను నేలమట్టం చేశారని అమిత్ షా అన్నారు. అలాగే ముస్లిం మహిళలకు ఎంతగానో మేలు చేసిన ట్రిపుల్ తలాక్ రద్దును కూడా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఇటీవల కొల్హాపూర్, సంఘ్లీ ప్రాంతాల్లో సంభవించిన వరదల గురించి ప్రస్తావించిన అమిత్ షా ఈ రెండు జిల్లాలను కేంద్రం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని గతంలో పాలించిన కాంగ్రెస్, ఎస్సీపీ కూటమి ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యంపై 70వేల కోట్లు ఖర్చుపెట్టిందని, కానీ ఒక్క చుక్క నీరు కూడా గ్రామాలకు చేరలేదని అమిత్ షా ధ్వజమెత్తారు. అయితే, ఫడ్నవిస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జలసంరక్షణ పథకం పేరిట కేవలం 9వేల కోట్లు ఖర్చుపెట్టి 11వేల గ్రామాలకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించారని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీ పాలనలో రాష్ట్రంలో అనినీతి రాజ్యమేలిందని పేర్కొన్న ఆయన అంతకుముందు అన్నిరంగాల్లోనూ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండేదని గుర్తుచేశారు. కానీ ఈ కూటమి పాలనలో రాష్ట్రం దిగజారిందని పేర్కొన్న ఆయన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వవైభవం కల్పించామని తెలిపారు.
*చిత్రం..మహారాష్ట్రంలోని కరద్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా