జాతీయ వార్తలు

నగర జీవనం... నరక ప్రాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: పల్లె‘టూర్లు’, ఇతర సుదూర ప్రాంతాల నుంచి ఉద్యోగ్యం కోసమో, విద్యాభ్యాసం కోసమో నగరాలకు చేరుకునే వారి జీవితం నరక యాతనంగా మారింది. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు యువత పరుగులు పెడుతున్నది. అయితే ఒంటరిగా వచ్చే వారికి ఇల్లు దొరకడమే గగనం అవుతున్నది. ఒంటరిగా ఉండాలనుకునే బ్యాచిలర్స్‌కు తొలుత యజమాన్యం అద్దె ఇల్లు ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా అద్దె ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి వెనుకంజ వేయడం జరుగుతున్నది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి స్థలం ఉన్న వారు దానిని కూల్చి వేయించి, అద్దెలు వచ్చేలా పునర్ నిర్మాణం చేపడుతున్నారు. అపార్టుమెంట్‌లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుంటే యజమానికి అద్దె చెల్లిస్తే సరిపోదు. అద్దెతో పాటు మెయింటెనెన్స్ ఛార్జీలూ చెల్లించాల్సిందే. మెయింటెనెన్స్, కరెంటు బిల్లు ఛార్జీలు తడిసి మోపెడంత అవుతున్నాయి. విద్యాభ్యాసం కోసమో, ఉద్యోగం కోసమో నగరాలకు చేరుకున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంటున్నది.
తెలియని తోడు-నీడ
ఈ దశలో బ్యాచిలర్లు నలుగురైదుగురు కలిసి సహ జీవనం చేయాలన్న నిర్ణయానికి వచ్చి అపార్టుమెంట్‌లో లేదా సర్వీసు అపార్టుమెంట్‌లో నివసిస్తున్నారు. ఆ నలుగురైదుగురు కలిసి అద్దె చెల్లించడంతో వారిపై భారం పడడం లేదు. అలా కలిసి ఉండడం వల్ల ఒక్కొక్కరిపై నెలకు ఐదు ఆరు వేల రూపాయలకు మించి భారం పడడం లేదు. (సర్వీసు అపార్ట్‌మెంట్లే కాకుండా కొన్ని హోటళ్ళు కూడా ఈ విధంగా ఒకే గదిలో నాలుగైదు పడకలు వేసి బ్యాచిలర్లకు ఇస్తూ అద్దె తీసుకుంటున్నారు. రూ.6 నుంచి రూ.23 వేల వరకూ వసూలు చేస్తున్నవీ ఉన్నాయి) ఆ ఫ్లాట్‌లో లేదా రూంలో దిగిన వారిలో ఎవరికి ఎవరో తెలియదు. ఎవరికి ఎవరో తెలియకపోయినా కలిసి జీవిస్తున్నారు. ఉదయమే ఎవరి పనిపై వారు వెళతారు. రాత్రికి తల దాచుకునేందుకే ఆ అద్దె ఇంటికి చేరుకుంటారు. బడలికతో ఉంటే నిద్రకు ఉపక్రమిస్తారు. లేదంటే కొంత సేపు కాలక్షేపంగా నాలుగు విషయాలు ముచ్చటించుకుని నిద్దుర పోతారు. మళ్లీ ఉదయం లేవగానే తమ పనులపై పరుగులు.
సర్వీసులో కొంత వేరు..
ఇక దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సర్వీసు అపార్ట్‌మెంట్ల సంస్కృతి వచ్చేసింది. సర్వీసు అపార్ట్‌మెంట్లలో ఇంకా తేలికైన పని. ఉదయం నిద్దుర లేచి రెడీ అయితే చాలు, ఆవరణలోనే డైనింగ్ హాలులో బ్రేక్ ఫాస్ట్ రెడీగా ఉంటుంది. తినేసి ఆఫీసుకో, కళాశాలకో బయలుదేరితే మళ్లీ రాత్రికి చేరుకున్నాక భోజనం సిద్ధంగా ఉంటుంది. దీనికి ఇక్కడ నిర్ణీత సమయాలు ఉంటాయి. అయితే స్వయంగా వండుకుని తినే పని ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి నగరాలకు చేరుకుంటున్న వారు సర్వీసు అపార్ట్‌మెంట్లకే ప్రాధాన్యతనిస్తున్నారు.
ఓయో ప్రవేశం..
అనేక కారణాలతో మెట్రో నగరాలకు చేరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంటున్నది. దీంతో నగరాలపై వత్తిడి పెరుగుతున్నది. ఆ అవసరాలకు అనుగుణంగా ఇంకా సరైన వసతి, సౌకర్యాలు లేకపోవడంతో, భారీగా పెరిగిన అద్దెలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒయో లైఫ్ సంస్థ గత ఏడాది మెట్రో నగరాలకు చేరుకునే వారికి వసతి, సౌకర్యాలు కల్పించడం ప్రారంభించింది. న్యూఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్, బెంగళూరు, పుణేల్లో 500లకు పైగా భవనాలు ఏర్పాటు చేసి 25,000 పడకలు సమకూర్చింది. మంచి స్పందన రావడంతో ఆ సంస్థ దీనిని ఇంకా విస్తరించనున్నది. కలిసి జీవించడం ఇప్పుడు కొత్తదేమీ కాదని, పూర్వ కాలంలో ధర్మశాలలు ఉండేవని ఓయో న్యూ రియల్ ఎస్టేట్ బిజినెస్ సీఇవో రోహిత్ కపూర్ తెలిపారు. ఇలా కలిసి జీవించడం వల్ల భారం పడకపోవడం, ఎప్పుడంటే అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోయేందుకు వీలుండడం వల్ల నగరాలకు చేరుకుంటున్న వారు సర్వీసు అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పైగా ఖాళీ చేసేప్పుడు తమ సొంత లగేజీ తప్ప ఫర్నీచర్, వంట సామాగ్రి, బీరువాలు, ఇతరత్రా సామాగ్రి ఏమీ ఉండదు కాబట్టి సునాయసంగా ఉంటుందని వారి భావన. సాధారణంగా ఒక కుటుంబం అద్దె ఇంటి నుంచి మరో అద్దె ఇంటికి మారాలనుకున్నప్పుడు కలిగే ఇబ్బంది సామాన్యమైంది కాదు. ఒంటరిగా ఉండేందుకు వచ్చే వారికే ఇది వీలవుతుంది తప్ప కుటుంబ సభ్యులతో కలిసి జీవించేందుకు వీలుండదు.