జాతీయ వార్తలు

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశంలో డిజిటల్ మీడియాను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు సూచనలు, సలహాలు కోరుతున్నట్టు సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ ఖారే వెల్లడించారు. ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్రాడ్‌కాస్టింగ్’ కింద మూడు రోజుల శిక్షణ కార్యాక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ‘ప్రెస్, ఫిల్మ్ సర్ట్ఫికేషన్, ప్రసార విభాగాలకు వేర్వేరుగా నియంత్రణ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఈ మూడింటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది’అని వెల్లడించారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు ఓ సవాల్‌గా మారాయని వాటిని అధిగమించడానికి తక్షణం చర్యలు తీసుకోవల్సి ఉంటుందని ఖారే అన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్), ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్(ఐటీయూ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఓవర్ ద టాప్ ప్లాట్‌ఫామ్స్(ఓటీటీ)ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు సలహాలు, సూచనలను ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సాంకేతిక మార్పులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయని ఆయన ప్రకటించారు. శిక్షణకు హాజరైన వారందరూ అభిప్రాయాలు వెల్లడించాలని ఆయన కోరారు. ‘ ముంబయిలో చిత్రరంగ ప్రముఖులతో సమావేశం కానున్నాం. ఓటీటీపై మరోసారి సెమినార్ ఏర్పాటు చేస్తాం’అని ఆయన స్పష్టం చేశారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకే గొడుగు కిందకు తెచ్చే ఆలోచన ఉందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాష్ జావడేకర్ ఇంతకు ముందే ప్రకటించారు. మాద్యమాల నియంత్రణకు చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. ‘ఇప్పటికే హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రేమ్ వీడియో సైట్‌లు ఇంటర్నెట్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. కొత్త చిత్రాలూ వీక్షకులకు లభిస్తున్నాయి. అందులో మంచి, చెడు, అత్యంత దారుణమైనవీ ఉంటున్నాయి. ఇలాంటివాటిని నియంత్రించేది ఎవరు? ఇప్పటికైతే అలాంటిదేదీ లేదు. అలాగే న్యూస్ పోర్టల్స్‌కు ఓ సర్టిఫెకేషన్ బాడీ లేదు’అని మంత్రి గత వారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో పేర్కొన్నారు. కాగా రెండు మూడేళ్లలో దేశంలోని 20 మిలియన్ల గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నట్టు సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి ఖారే వెల్లడించారు. ఇంటర్నెట్ కేబుల్ ద్వారానే టీవీ ప్రసారాలు అందుతాయని ఆయన అన్నారు. ‘టూ-వే స్విచ్’తోపాటు కొన్ని మార్పులతో రెండు సదుపాయాలూ పొందవచ్చు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అలాగే స్వయం ఉపాధి లభిస్తుందని ఖారే వెల్లడించారు. ప్రసార మాద్యమం విస్తృతమవుతోందని దేశంలో 197 మిలియన్ ఇళ్లకు టీవీ కనెక్షన్లున్నాయని ఆయన చెప్పారు. ఈ పరిశ్రమంలో నియంత్రణా వ్యవస్థ ఉండాల్సిందేనని ట్రాయ్ చీఫ్ ఆర్‌ఎస్ శర్మ అన్నారు. నియంత్ర అన్నది అభివృద్ధి, అనే్వషణకు మార్గం చూపాలని ఆయన స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమాన్ని టెలీకాం వివాదాల పరిష్కారం, అప్పిలేట్ ట్రిబ్యూనల్ చైర్మన్ జస్టిస్ శివ కీర్తి సింగ్ ప్రారంభించారు. 17 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ శాఖలు, ప్రసార సంస్థలు, డీటీహెచ్ పంపిణీదారులు, కేబుల్ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.