జాతీయ వార్తలు

ఢిల్లీ గురుద్వారాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిషేధించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ తన పరిధిలోని 11 ప్రముఖ గురుద్వారాల్లో బుధవారం నుంచి ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ బ్యాగ్‌లు, ఇతర వస్తువులతో పాటు థర్మోకాల్ వస్తువులను కూడా వినియోగించకూడదని నిర్ణయం తీసుకొంది. ప్లాస్టిక్ ప్లేట్‌లు, గ్లాసులు, స్పూన్‌లు, పాలిథీన్ బ్యాగులు వాడకూడదని అక్టోబర్ రెండో తేదీ నుంచే నిర్ణయించామని కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా స్పష్టం చేశారు. ఈమేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం పూర్తి చేశామని ఆయన వివరించారు.