జాతీయ వార్తలు

బీడీసీ ఎన్నికలను బహిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, అక్టోబర్ 9: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు పార్టీ సీనియర్ నేతల నిర్బంధాన్ని కొనసాగించడాన్ని నిరసిస్తూ బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (బీడీసీ) ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఆగస్టు ఐదో తేదీన కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్న తరువాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు బీడీసీ కావడం విశేషం. ‘ప్రజాస్వామ్య సంస్థల బలోపేతంపై మాకు బలమైన విశ్వాసం ఉంది.. గతంలో ఎప్పుడూ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ భావించలేదు.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అవలంబిస్తున్న విరుద్ధమైన విధానాలతో పాటు పార్టీ సీనియర్ నాయకుల నిర్బంధాన్ని ఇంకా కొనసాగించడాన్ని నిరసిస్తున్నాం.. అందుకే బీడీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నాం’ అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మీర్ బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా రద్దు నిర్ణయం తీసుకొన్న వెంటనే మీర్‌ను పోలీసులు అరెస్టు చేసి ఇటీవలే విడుదల చేశారు. అధికార బీజేపీ గెలుపుకోసం ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని.. ఇతర పార్టీల నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందని ముఖ్యంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొందని మీర్ ఆరోపించారు.
బీడీసీ ఎన్నికల ప్రక్రియ కాశ్మీర్‌లో సజావుగా సాగాలే చూడాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించిందని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా కాంగ్రెస్ కూడా బీడీసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టిందని.. ఈమేరకు నామినేషన్లను కూడా వేశారని’ పీసీసీ అధ్యక్షుడు అన్నారు. అయితే, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీడీసీ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చినట్లు మీర్ స్పష్టం చేశారు.