జాతీయ వార్తలు

విదేశాంగ నిష్పాక్షికతకు తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: విదేశాంగ విధానంలో తటస్థ వైఖరిని అవలంబించాలన్న కాలపరీక్షకు నెగ్గిన నియమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరో దేశంలో జరిగే ఎన్నికల్లో ఏ విధంగానూ జోక్యం చేసుకోకుండా నిష్పాక్షికంగా ఉండాలన్నది భారత విదేశాంగ విధానమని, కానీ హౌడీ మోడీ సభలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరఫున ప్రధాని మోదీ ప్రచారం చేశారని ఆరోపించింది. అమెరికాలోని ఒక పార్టీకి, అదీ ఎన్నికల తరుణంలో మద్దతు ఇవ్వడం ద్వారా భారత్ ఇప్పటివరకు అనుసరిస్తూ వచ్చిన నిష్పాక్షిక విధానాన్ని మోదీ తుంగలో తొక్కారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విధమైన చర్య ద్వారా భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాల్లో అలజడి సృష్టించారని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ అన్నారు. అమెరికా ఎన్నికల్లో భారత్ ఏ పార్టీ తరఫునా ప్రచారానికి దిగకూడదని, కానీ హోస్టన్ సభలో మోదీ చేసిన ప్రసంగాన్ని బట్టి చూస్తే ‘ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అన్న భావనే కలిగిందని అన్నారు. ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులతో భారత ప్రభుత్వాలు ఏ రకమైన సంబంధాలను కలిగివున్నా అక్కడ జరిగే ఎన్నికల్లో మాత్రం నిష్పాక్షిక వైఖరినే అవలంబించాలన్నది భారత్ విధానంగా వస్తోందని ఆనంద్ శర్మ తెలిపారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం హోస్టన్ సభలో దీనికి విరుద్ధంగా వ్యవహరించారని సోమవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆనంద్ శర్మ విరుచుకుపడ్డారు. అమెరికాలో డెమోక్రాట్లు అధికారంలో ఉన్నపుడు, రిపబ్లికన్లు అధికారంలోకి వచ్చినపుడు కూడా భారత్ ప్రభుత్వాలు అదే సహకార స్ఫూర్తితో పనిచేశాయని ఆయన అన్నారు. రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్నపుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌తో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చారిత్రక అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. అయినప్పటికి కూడా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మన్మోహన్ సర్కార్ రిపబ్లికన్లను బలపరచలేదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామాతో కూడా ప్రభుత్వపరంగా సత్సంబంధాలనే కొనసాగించామని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. భారత వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవాలంటే ఇతర దేశాల్లోని అన్ని పార్టీలతో సత్సంబంధాలను కలిగి ఉండాలని అన్నారు. ట్రంప్‌ను బలపరుస్తున్న నరేంద్ర మోదీ హెచ్-1బీ వీసాల విషయంలో ఆయనపై ఒత్తిడి తేవాలని, ఫీజులు తగ్గించేలా చూడాలని, అలాగే భారత ఎగుమతులు పెరిగేలా ఆయనతో మంతనాలు సాగించాలని ఆనంద్ శర్మ సూచించారు.