జాతీయ వార్తలు

ఒడిశా పిటిషన్‌ను తిరస్కరించిన ట్రిబ్యునల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23: ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల మధ్య వంశధార నదీ జలాల వాటాలు, నేరడి వద్ద నిర్మించనున్న బ్యారేజీ వివాదానికి సంబంధించిన ఒడిశా సర్కార్ వేసిన పిటీషన్‌ను వంశధార ట్రిబ్యునల్ తిరస్కరించింది. సోమవారం తాజాగా వెలువడిన తీర్పుతో రెండు వారాల పాటు తీర్పును నిలుపుదల చేయాలని ఒడిశా అడిగిన విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ అంగీకరించలేదు. జిల్లాలో భామిని మండలం నేరడి వద్ద నిర్మిస్తున్న బ్యారేజీని అడ్డుకునేందుకు ఒడిశా చేస్తున్న రాద్ధాంతం వద్దంటూ వంశధార ట్రిబ్యునల్ (ఢిల్లీ) తీర్పు వెల్లడించింది.
నేరడి బ్యారేజీకి సంబంధించి 106 ఎకరాల్లో ప్రహరీ కట్టడానికి జాయింట్ సర్వేకు గతంలో అనుమతించిన వంశధార ట్రిబ్యునల్ ఆ ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను వంశధార ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 106 ఎకరాలకు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. 106 ఎకరాల సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ మార్గదర్శకత్వంతో నివేదిక సిద్ధం చేయాలని సూచించింది.
ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ 30లోగా పూర్తి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. జవవరి 10కి విచారణ వాయిదా వేస్తూ రెండువారాల పాటు తీర్పును నిలుపుదల చేయాలని ఒడిశా కోరిన విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ అంగీకరించలేదు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై వంశధార ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉండడంతో జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్ హర్షం వ్యక్తం చేసారు. గొట్టా బ్యారేజీలో నీటి నిల్వలను 50:50 నిష్పత్తిలో వాడుకోవాలని ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు సూచించింది. మే 31నే బ్యారేజీ గేట్లు మూసివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయకట్టు ఆధారంగా రెండు రాష్ట్రాలు ఖర్చు భరించాలని గతంలో పేర్కొన్న తీర్పునే మరోసారి గుర్తుచేసింది. జూన్ 1 నుంచి ఆరు మాసాలు పాటు నేరడి బ్యారేజీ నుం నీటిని ఏపీ వాడుకోవచ్చునని ట్రిబ్యునల్ చెప్పిన తీర్పులో హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 టీఎంసీల నీటిని వాడుకునన్నాక బ్యారేజీ గేట్లు మూసివేయాలన్న ఆదేశాలు తప్పకుండా ఏపీ సర్కార్ పాటించాలని సూచించింది. ఈ తీర్పును అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు 106 ఎకరాల భూమిని ఒడిశా సేకరించి ఏపీకి ఇవ్వాల్సి వుందని, ఆ సర్వే సకాలంలో పూర్తి చేయాలని హుకుం జారీ చేసింది.
నష్టపరిహారం సహా ఖర్చులన్నీ ఏపీయే భరించాలని ట్రిబ్యునల్ వెల్లడించింది. ఎన్నో ఏళ్ళుగా వంశధార ట్రిబ్యునల్‌లో మగ్గిపోతున్న కేసులో చివరికి విజయం ఏపీనే వరించింది. కాలయాపన జరిగినా చివరికి న్యాయమే జరిగిందని ఏపీ సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. 1962లో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య కుదిరిన అంగీకరం మేరకే తాజాగా ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించడంతో నాటి ఇరుగుపొరుగు రాష్ట్రాల జల ఒప్పందాలే నేటి తాజా తీర్పునకు పూర్తిగా సహకారం అందించిందంటూ ఇంజనీరింగ్ నిపుణులు చెప్పే మాట.