జాతీయ వార్తలు

370 కాదు..ఇక 700 ర్యాలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన 370 రాజ్యాంగ అధికరణ రద్దుపై దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ర్యాలీలకు అనూహ్య స్పందన వస్తోందని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు 370 బహిరంగ సభలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న తాము ప్రజల వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని 700 సభలను చేపట్టాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సానుకూల ప్రతిస్పందన వచ్చిందని వెల్లడించాయి. గుజరాత్, కర్నాటక వంటి రాష్ట్రాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బహిరంగ సభలను నిర్వహించాలని సంకల్పించామని అన్నారు. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో 19, 21 బహిరంగ సభలు చొప్పున నిర్వహించాలని నిర్ణయించుకున్న తాము ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని ఈ రాష్ట్రాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపాయి. ప్రతి రాష్ట్రంలోనూ ముందుగా నిర్ణయించుకున్న వాటికంటే కూడా ఎక్కువ సభలు, ర్యాలీలు నిర్వహిస్తామని, మొత్తంగా వీటి సంఖ్య 350 నుంచి 700కు పెరుగుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. బీహార్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ సభల సంఖ్య 45, 45, 31కి పెరిగిందని ఆయన వివరించారు.
370 అధికరణ రద్దు, దేశ భద్రతకు, కాశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం అంటూ ఇప్పటివరకు జరిగిన ర్యాలీల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. అంతేకాదు, భారత్‌లో పరిపూర్ణంగా కాశ్మీర్ విలీనానికి ఈ నిర్ణయం దోహదం చేసిందని కూడా బీజేపీ అగ్ర నేతలు పేర్కొన్నారు.