జాతీయ వార్తలు

రెండేళ్లు గ్రామాల్లో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 23: ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు రెండేళ్ల పాటు విధిగా గ్రామాల్లో పనిచేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఉన్నత చదువులకు వెళ్లడం కుదరదని సోమవారం ఇక్కడ తేల్చిచెప్పారు. ఎండీ లేదా ఎంఎస్ పూర్తయిన వారూ ఏడాది కచ్చితంగా పల్లెల్లో పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆయుష్మాన్ భారత్ దివస్ తొలి వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘మేం రెండేళ్లు గ్రామాల్లో పనిచేస్తామని యువ వైద్యులు బాండ్ రాసి ఇవ్వాలి. ఎండీ, ఎంఎస్ పీజీ కోర్సులు చేసిన వారు ఏడాది పాటు పల్లెలో సేవలందించాలి. లేని పక్షంలో ప్రభుత్వం ఇంటర్న్‌షిప్‌కు అనుమతి ఇవ్వదు’అని యోగి చెప్పారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన విజయవంతమైందని సీఎం ప్రకటించారు. 1.18 కోట్ల కుటుంబాలకు పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతోందని యూపీ సీఎం తెలిపారు. అలాగే సీఎం జన్ ఆరోగ్య యోజన్ పథకం కింద 8.45 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగిందన్నారు. 1.89 లక్షల మందికి గోల్డ్ కార్డులు అందచేసినట్టు ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఏడాది క్రితం పథకం ప్రారంభించే సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, సమర్ధవంతగా పనిచేయబట్టే ఇప్పుడది విజయవంతంగా నడుస్తోందని ఆయన అన్నారు. అనేక జిల్లాల్లో ప్రజలకు చేరువైందన్న యోగి ఆదిత్యనాథ్ ‘ప్రజలందరికీ అందించాలన్న కృతనిశ్చయంతో మేం పనిచేస్తున్నాం’అని వెల్లడించారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ప్రజలకు చేరువ చేయడానికి వైద్యశాఖ అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఇలాంటి పథకం రాలేదని, ప్రజలకు సామాజిక భద్రత చేకూరుతోందని యూపీ సీఎం ప్రకటించారు. ఈ పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్యోగ స్కీమ్ అని యోగి చెప్పారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని విస్తరించేందుకు బీజేపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. 1947-2012 వరకూ కేవలం 12 మెడికల్ కాలేజీలే ఉంటే తమ ప్రభుత్వం కొత్తగా 15 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చిందని ప్రకటించారు. ఇప్పటికే ఏడు కళాశాలలు పనిచేస్తున్నాయని యోగి పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు అదనంగా అంబులెన్స్‌లు సమకూర్చినట్టు ఆయన తెలిపారు.