జాతీయ వార్తలు

గత పరాజయాన్ని విస్మరించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: ఉగ్రవాద ధోరణిని పాకిస్తాన్ విడనాడితేనే దాంతో తదుపరి చర్చలకు ఆస్కారం ఉంటుందని, ఆ చర్చలు కూడా ఆక్రమిత కాశ్మీర్‌పైనేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెగేసి చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపించే చర్యలను కట్టిపెట్టాలని పాక్‌ను గట్టిగా హెచ్చరించిన ఆయన ‘1965, 72నాటి పొరపాట్లను మళ్లీ చేయొద్దు. ఆ రెండు యుద్ధాల్లోనూ భారత్ విజయం సాధించిన విషయాన్ని మరచిపోవద్దు’ అని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న విషయాన్ని పాక్ ఎన్నటికీ మరచిపోకూడదన్నారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి చర్యలూ చేపట్టాల్సిన అవసరం ఉండదని పేర్కొన్న ఆయన అది ఎంచుకున్న ఉగ్రవాద పదమే దాని అంతానికి దారితీస్తుందని స్పష్టం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం వంటి చర్యలు పాకిస్తాన్‌ను మింగేస్తాయని అన్నారు. ఒక దేశ టెర్రరిస్టు మరో దేశ స్వాతంత్య్ర సమరయోధుడన్న పాకిస్తాన్ వాదనను గట్టిగా తిప్పికొట్టిన రాజ్‌నాథ్ ‘తమ దేశంలో ఉగ్రవాదాన్ని సమర్థించుకునేందుకు పాక్ ఈ వాదన చేస్తోంది’ అని పేర్కొన్నారు. భారత్‌లోకి ఎంత మంది ఉగ్రవాదులను పాక్ పంపినా వారిలో ఏ ఒక్కరూ కూడా వెనక్కివెళ్లరని స్పష్టం చేశారు.
కాశ్మీర్‌కు సంబంధించి దశాబ్దాలుగా అమలైన 370 రాజ్యాంగ ప్రత్యేక అధికరణ ఆ రాష్ట్రాన్ని ఓ మొక్కల తెగులులాగా పీల్చి పిప్పిచేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ ప్రత్యేక అధికరణ రద్దును నాలుగింట మూడొంతుల మంది రాష్ట్ర ప్రజలు బలపరిచారని స్పష్టం చేశారు. ఓ జాతీయ పార్టీగా బీజేపీ తన బాధ్యతను నిర్వర్తించిందని, 370 అధికరణ రద్దుకూడా రాష్ట్ర హితాన్ని, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమేనని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా, చిత్త శుద్దితో అమలు చేయగలిగే పార్టీగా బీజేపీ తన స్వభావాన్ని నిరూపించుకుందని రాజ్‌నాథ్ తెలిపారు. జమ్మూకాశ్మీర్ ఉగ్రవాదంతో దశాబ్దాలుగా సతమతమవడానికి కారణం 370 అధికరణంతో పాటు, దాన్నుంచి పుట్టిన 35ఏ సెక్షన్ కూడా అని రాజ్‌నాథ్ తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో కాశ్మీర్ అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తుందని, పరివర్తన పథంలో పరుగులు పెడుతుందని రక్షణ మంత్రి తెలిపారు. నాలుగింట మూడొంతుల మంది ప్రజలు ఈ అధికరణ రద్దును కోరుకున్నారని చెప్పడానికి కారణం వారి నుంచి లభిస్తున్న మద్దతేనని ఆయన అన్నారు. ఈ అధికరణ రద్దు విషయంలో తమ ఉద్దేశం నిజాయితితో కూడుకున్నది కాబట్టే మిత్రపక్షాలు కూడా దాన్ని బలపరిచాయని రాజ్‌నాథ్ వివరించారు. కాశ్మీర్‌లో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడితే తీవ్ర స్థాయిలో బుద్ధి చెబుతామని పాకిస్తాన్‌ను ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

*చిత్రం... జన జాగరణ్ ర్యాలీలో మాట్లాడుతున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్