జాతీయ వార్తలు

కర్నాటకలో ఉప ఎన్నికల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు ప్రకటన కర్నాటకలో కలకలం రేపింది. ముఖ్యమంత్రి యడియూరప్ప అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని హుటాహుటిన ఢిల్లీకి వచ్చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు. అనర్హత ఎమ్మెల్యేలకు అనుకూలంగానే సుప్రీం కోర్టులో తీర్పు వస్తుందన్న ఆశాభావం యడియూరప్ప వ్యక్తం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. హెచ్‌డీ కుమారస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై శాసన సభ్యులు తిరుగుబాటు చేశారు. చానాళ్లు రాష్ట్రం వీడి ముంబయిలో తిష్టవేశారు. శాసన సభ బలపరీక్షలో కుమారస్వామి వైఫల్యం చెందడం, యడియూరప్ప సీఎం కావడం జరిగిపోయింది. స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా చేయడానికి ముందు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి దిగిపోయారు. దీంతో 15 మంది అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగానే అనర్హత వేటు పడ్డ సభ్యుల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసీ ప్రకటనతో యడియూరప్ప హడావుడిగా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈనెల 30లోగా సుప్రీం కోర్టు తమకు అనుకూలంగా తీర్పును ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్ ముగిసిపోయినట్టేనని అనర్హత ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ల దాఖలకు సెప్టెంబర్ 30 తుది గడువుగా ఈసీ ప్రకటించింది. ముఖ్యమంత్రి యడియూరప్ప ఢిల్లీలో మీడియాతోమాట్లాడుతూ ‘కేసు సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు వస్తోంది. కచ్చితంగా మాకు అనుకూలంగానే తీర్పు ఉంటుందని ఆశిస్తున్నాం. స్పీకర్ రమేష్ కుమార్ సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. సుప్రీం తీర్పు మాకు అనుకూలంగా వస్తుందన్న ధీమాతో ఉన్నారు. చుద్దాం ఏమవుతుందో’అని సీఎం స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అయిన తరువాత యడియూరప్ప మీడియాతోమాట్లాడారు. కాగా రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం అనర్హతవేటు పడ్డ ఎమ్మెల్యేలతలో సమావేశమయ్యారు. ఆర్ శంకర్, ఎస్‌టీ సోమశేఖర్ రాజధాని ఢిల్లీలోనే ఉన్నారు. అమిత్ షాతో జరిగిన సమావేశం వివరాలు అనర్హత ఎమ్మెల్యేలకు బొమ్మై వివరించారు. అమిత్ షా, యడియూరప్ప అండదంటలు ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వీల్లేదు. సుప్రీం కోర్టులో ఉపశమనం వస్తే తప్ప రాజకీయ భవిష్యత్ గందరగోళమే. కర్నాటకలోని 15 అసెంబ్లీ నియోజకవర్గల ఉప ఎన్నికకు ఈసీ ప్రకటన చేసింది. అక్టోబర్ 21న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 24. ఉత్తర కర్నాటకలో ఏడు నియోజకవర్గాలున్నాయి. అలాగే రాయ్‌చూర్ జిల్లాలోని మస్కి, బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్ నియోజకవర్గాలపై ఎలాంటి ప్రకటన రాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండింటి కేసులూ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బతికి బట్టకట్టాలంటే ఉప ఎన్నికల్లో గెలవాల్సిందే.