జాతీయ వార్తలు

జిగేల్‌మనిపించేలా శోర్ ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మమలియాపురం (తమిళనాడు), సెప్టెంబర్ 22: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సందర్శించనున్న చారిత్రక శోర్ ఆలయాన్ని ప్రపంచ స్థాయిలో ముస్తాబు చేస్తున్నారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. అక్కడి ఐదు రథాలను సుందరంగా అలంకరిస్తున్నారు. చుట్టు పక్కల చెట్లను ట్రిమ్మింగ్ చేస్తూ, ల్యాండ్‌స్కేప్, మిరుమిట్లుగొలిపేలా విద్యుద్ధీకరణ చేస్తున్నారు. కీలకమైన సమ్మిట్ నేపథ్యంలో కళ్ళు జిగేల్‌మనిపించేలా ప్రపంచ స్థాయిలో ముస్తాబు చేస్తున్నారు. అవసరమైన చోట ఫ్లోరింగ్‌ను మారుస్తున్నారు. పురావస్తు శాఖ ఉన్నతాధికారులు, నిపుణులు, కన్సల్‌టెంట్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. అనంతరం వారు సమావేశమై ఈ చారిత్రక ప్రాంతాన్ని మోదీ, జీ జింపింగ్ సందర్శించనున్నందున ఏర్పాట్లు భారీగా ఉండాలని వారు భావించారు. వారిరువురూ ఆలయం చుట్టూర ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఐదు చారిత్రక రథాలనూ సందర్శిస్తారని, కొంత సేపు పరిసరాల్లో కాలి నడకన తిరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. వారిరువురూ మాట్లాడుకుంటూ అలా తిరుగుతూ విశ్రాంతి కోసం కొద్ది సేపు ఏదైనా బెంచ్‌పై కూర్చునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ బెంచ్‌లన్నింటికీ మెరుగులు పట్టిస్తున్నారు. పల్లవ రాజుల కాలం (700-728 ఎడి) నాటి పల్లవ రాజసింహ (నరసింహ-2) హయాంలో శోర్ శివాలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పల్లవ రాజు నరసింహవర్మన్-1 ఐదు ఏక శిల రాతితో ఐదు రథాలను తయారు చేయించినట్లు చెబుతున్నారు. పల్లవ రాజుల కాలం నాటి చారిత్రక కట్టడాలు, ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తించబడ్డాయన్నారు. ఆలయం ఆవరణలో ఇసుక పరుస్తున్నారు. మోదీ, జీ జింపింగ్ సందర్శించినప్పుడు వర్షం పడినా ఇసుక ఉంటే ఇబ్బంది ఉండదని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

*చిత్రాలు.. ముస్తాబవుతున్న శోర్ ఆలయం
*మోదీ - జీ జిన్‌పింగ్ (ఫైల్‌ఫొటో)