జాతీయ వార్తలు

ఉప ఎన్నికల్లో పోటీ చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 22: వచ్చే నెలలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో తమ ‘మకాకి నీధి మైయం’ (ఎంఎన్‌ఎం) పార్టీ పోటీ చేయదని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తెలిపారు. ఎఐఎడిఎంకె, డీఎంకె అధికారం కోసం చేస్తున్న పోరాటంలో అవినీతి రాజకీయ నాటకం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీ తొలి సారి పోటీ చేసి, మెజారిటీ స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. నగునేరి, విక్రవండి అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేసి అవినీతి రాజకీయ నాటకంలో చేరబోమన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసం ఆత్రుత పడుతున్నాయని ఆయన విమర్శించారు. తమ ‘మకాకి నీధి మైయం’ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదన్నారు. 2021లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. అవినీతి రాజకీయాలు నడుపుతున్న ఆ రెండు పార్టీలు ప్రజలకు నిస్వార్థంగా, అవినీతికి ఆస్కారం లేకుండా పాలన ఎలా చేయగలవని ఆయన ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
ఇలాఉండగా విక్రవండి అసెంబ్లీ స్థానంలో తమ పార్టీ పోటీ చేస్తుందని, నంగునేరి నియోజకవర్గంలో మిత్రపక్షమైన కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఢీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ ఇటీవల తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాలు ఈ ఏడాది జూన్, మే నుంచి ఖాళీగా ఉన్నాయి.

*చిత్రం...కమల్ హసన్