జాతీయ వార్తలు

ఆస్కార్ ఎంట్రీకి ‘గల్లీ బాయ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: జోయా అఖ్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘గల్లీ బాయ్’ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడేందుకు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ తరపున అధికారికంగా ఎంపికయింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) శనివారం ఈ విషయం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదలయిన ఈ చిత్రంలో అలియా భట్, విజయ్ రాజ్, కల్కి కొచ్లిన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ వర్మ, అమృత సుభాశ్ నటించారు. రితేశ్ సిధ్వాని, ఫర్హాన్ అఖ్తర్ నిర్మించిన ‘గల్లీ బాయ్’ చిత్రంలో రణ్‌వీర్ ప్రధాన పాత్రలో నటించారు. రాప్ సంగీతంలో రాణించాలన్న బలమయిన కోరిక గల హీరో వేగంగా పురోగమిస్తూ ముంబయి వీధుల్లో తన జీవితాన్ని వర్ణిస్తూ పాడటం ద్వారా తన కలను నెరవేర్చుకున్నాడు. ‘ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డు కోసం భారత్ తరపున అధికారికంగా పోటీ పడుతున్న చిత్రం ‘గల్లీ బాయ్’. దీని కోసం 27 చిత్రాలు పోటీ పడగా, ‘గల్లీ బాయ్’ను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది’ అని ఎఫ్‌ఎఫ్‌ఐ సెక్రటరి జనరల్ సుప్రన్ సేన్ ఒక వార్తాసంస్థకు తెలిపారు. ఈ సంవత్సరం ఎంపిక కమిటీ జ్యూరీకి నటి-్ఫల్మ్‌మేకర్ అపర్ణా సేన్ నేతృత్వం వహించారు.