జాతీయ వార్తలు

అట్టప్పాడేలో అక్షర కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, సెప్టెంబర్ 21: అట్టప్పాడే కేరళలోని ఓ మారుమూల గిరిజన గ్రామం. రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన కుగ్రామం. నిన్నమొన్నటి వరకూ శిశు మరణాలు, పౌష్టికాహారం లేమి, పేదరికం అట్టప్పాడేను పీడించుకుతినేవి. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. అట్టప్పాడేలో కొత్తశకం మొదలైంది. పశ్చిమ కనుమల్లోని నీలగిరి పర్వత ప్రాంతమైన పలక్కాడ్ జిల్లాలోని ఈ కుగ్రామం జాతకమే మారిపోయింది. దేశంలోనే పూర్తి అక్షరాస్యత సాధించిన తొలి గిరిజన గ్రామంగా చరిత్ర సృష్టించనుంది. అధికారుల ప్రయత్నాలకు గ్రామస్తుల సహకారం అక్షరజ్యోతి కాంతులీనుతోంది. అట్టప్పాడే సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా 2020 జూన్‌లో అధికారికంగా ప్రకటించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అక్షరాస్యతలో దేశంలోనే కేరళ ముందుంది. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ (కేఎస్‌ఎల్‌ఎం) గిరిజన తండాలు, జాలర్లు, వలస ప్రజలుండే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతమైంది. అట్టప్పాడేలో మూడో విడత అక్షరాస్యత కార్యక్రమం ఈ నెల 27 ప్రారంభకానుంది. ‘గతంలో రెండు కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. తండా మొత్తం సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి గిరిజన గ్రామంగా చరిత్ర సృష్టించనుంది’అని కేఎస్‌ఎల్‌ఎం డైరెక్టర్ పీఎస్ శ్రీలేఖ వెల్లడించారు. యునెస్కో నిబంధనల ప్రకారం ఏ గ్రామంలోనైనా 90 శాతం పైగా ప్రజలు చదువునేర్చుకుంటే దాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా ప్రకటిస్తారని ఆమె స్పష్టం చేశారు. అట్టప్పాడేలో అక్షరాస్యత కార్యక్రమం మూడు దశల్లో సాగింది. 2016 డిసెంబల్‌లో తొలి కార్యక్రమం కింద 5,031 మందిని నిరక్షరాస్యులుగా గుర్తించారు. వారిలో 1117 మందిని తొలిదశలో, 2553 మందిని రెండో దశలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్టు శ్రీలేఖ ప్రకటించారు. మొత్తంగా 3,670 మంది కొత్తగా అక్షరాస్యులయ్యారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం 1361 మందిని అక్షరాస్యులుగా ప్రకటించాల్సి ఉందని ఆమె అన్నారు. ఈ నెల 27న మూడో విడత అక్షరాస్యత కార్యక్రమం ప్రారంభవవుతోంది. అట్టప్పాడే బ్లాక్‌లోని అగాలీ, పుత్తూర్, షోలాయూర్‌లోనూ రెండు విడతల కార్యక్రమం విజయవంతమైందని ఆమె వెల్లడించారు. కొత్త అక్షరాస్యులకు నాలుగో తరగతి సమాన పాఠ్యాంశాలు బోధిస్తున్నట్టు శ్రీలేఖ తెలిపారు. అట్టప్పాడే అక్షరాస్యత కార్యక్రమం 275 మంది ఇన్‌స్ట్రక్టర్లు పనిచేస్తున్నారు. 218 మంది గిరిజనులనూ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు. కొత్త చదువరులకు గంట సేపుపాఠాలు బోధిస్తున్నారు. ప్రతి రోజూ 15 నుంచి 25 మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతారు. తరగతులకు హాజరయ్యే వారికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పేదరిక విద్యా మిషన్ ‘కుడుంబశ్రీ’ పథకం కింద ఉచితంగా భోజనాలు పెడుతున్నారు. కొత్తగా అక్షరాస్యులైన వారి కోసం దినపత్రికలు, వారపత్రికలు అందజేయాలని నిర్ణయించినట్టు డైరెక్టర్ శ్రీలేఖ వెల్లడించారు. అట్టప్పాడే రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతం. అక్కడ 32,956 మంది గిరిజనులు ఉన్నారు. ఐరులస్, ముదుగాస్, కురంబాస్ గిరిజన తెగలవారే ఎక్కువ మంది నివసిస్తున్నారు. పౌష్టికాహార లోపం వల్ల శిశుమరణాలు ఎక్కువగా సంభవిస్తాయని ఆమె తెలిపారు. చదువులేకపోవడం వల్ల వెనకబాటుతనం వెంటాడేదని అన్నారు. ఇప్పుడు అవన్నీ మటుమాయమైపోయి భిన్నమైన పరిస్థితుల కనిపిస్తున్నట్టు శ్రీలేఖ చెప్పారు.