జాతీయ వార్తలు

స్ట్రాబెర్రీ తోటల్లోకి అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లివర్‌పూల్, సెప్టెంబర్ 18: సాధారణ ప్రజానీకం లివర్‌పూల్‌లోని స్ట్రాబెర్రీ తోటలను తిలకించే అవకాశం త్వరలోనే కలుగనుంది. ‘బీటిల్స్’ బృందంలోని జాన్ లెనాన్ పాడిన సుప్రసిద్ధమైన ‘స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ ఫరెవర్’ అనే పాటకు మూలం ఈ తోటలే. అందుకే లివర్‌పూల్‌లోని ఈ ప్రత్యేక తోటను తిలకించడానికి వేలాదిమంది బీటిల్స్ తరలివస్తారు. ఇక్కడి తోటలకేకాక, ప్రధాన గేటుకు వేసే ఎర్ర రంగుకు కూడా ఓ ప్రత్యేక ఉంది. లెనాన్ పాటకు, స్ట్రాబెర్రీ తోటకు అక్కడి గేటుకు విడదీయరాని అనుబంధం ఉంది కాబట్టే అభిమానులతోపాటు సాధారణ ప్రజానీకాన్ని కూడా ఈ తోటల్లోకి అనుమతించనున్నారు. గేటు తెరిచిన వెం టనే సుమారు 60 వేల మంది ఈ తోటల్లోకి వెళ్తారని అంచనా. తొక్కిసలాట జరుగకుండా ముందుజాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుం డా వికలాంగులకు సాయం చేసేందుకు వలంటీర్లు కూడా సిద్ధంగా ఉంటారు.