జాతీయ వార్తలు

7శాతం వడ్డీకే రైతులకు రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: తెలంగాణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఏడు శాతం వడ్డీ రుణాలను కొనసాగించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం వినోద్ కుమార్, ముల్కనూరు కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి అభిలాక్ష్ లిఖి, అదనపు కార్యదర్శి డోలి చక్రవర్తిని కలిశారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 108 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ఏడు శాతానికే రైతులు రుణాలు లభించేవని.. అందులో కేంద్రం మూడు శాతం, నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం వల్ల రైతులకు సున్నా శాతానికే రుణాలు లభించేవన్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన విధానాల వల్ల వడ్డీ రుణాల విషయంలో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. దీనిపై గంతలో కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పారు. రైతులకు అన్యాయం జరగకుండా ఏడు శాతం వడ్డీకే రుణాలు ఇప్పించాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.