జాతీయ వార్తలు

ఆ కుటుంబాన్ని దూరదర్శన్ కలిపింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 18: ఇది కథ కాదు, దీన గాథ. సినీమాల్లో చూపించినట్లే జరిగిన యథార్థ గాథ. దూరదర్శన్ టీవీలో ప్రసారమైన ఓ వార్తా కథనంతో రెండున్నర ఏళ్ళ క్రితం తప్పిపోయిన తనయుడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఉత్తర కోల్‌కత్తాలోని అహిరిటోల ప్రాంతానికి చెందిన కార్తీక్ షా దంపతులకు మానసిక స్థితి బాగా లేని 13 ఏళ్ళ బాలుడు 2017 సంవత్సరం ఫిబ్రవరి 10న తప్పిపోయాడు. దీంతో కార్తీక్ షా తన కుమారుడు అదృశ్యం కావడంపై అప్పుడే ఫిర్యాదు చేశాడు. ఎంత వెతికినా కుమారుని జాడ తెలియలేదు. ఇలాఉండగా ఈ నెల 15న దూరదర్శన్ వార్తల్లో మానసిక వికలాంగులకు సంబంధించి ఓ కార్యక్రమం ప్రసారమైంది. అనుకోకుండా ఆ కార్యక్రమాన్ని చూసిన తండ్రి కార్తీక్ షా మానసిక వికలాంగుల పిల్లలతో పాటు తన కుమారుడు ఉండడాన్ని గమనించాడు. దీంతో సంతోషంతో స్థానిక పోలీసు స్టేషన్‌కు పరుగెత్తి, దూరదర్శన్‌లో ప్రసారమైన కార్యక్రమంలో తన కుమారుడు ఉండడాన్ని చూసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు దూరదర్శన్ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర పట్టు పురుగుల పెంపకం శాఖలో ఉద్యోగం చేస్తున్న మోస్లెమ్ మున్షీ నాదియా జిల్లాలో నక్షిప్రా ప్రాంతంలో మానసిక వికలాంగుల కోసం ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. నాదియా జిల్లా యంత్రాంగానికి రెండున్నర ఏళ్ళ క్రితం తప్పిపోయిన ఈ మానసిక స్థితి బాగా లేని బాలుడు దొరికాడు. ఏడాది వరకు ప్రభుత్వ వసతి గృహంలో ఉంచినా, ఆ తర్వాత ఏడాదిన్నర క్రితం ఈ శిబిరానికి అప్పగించడమైంది. చివరకు ఆదివారం మానసిక వికలాంగులపై దూరదర్శన్‌లో ప్రసారమైన కథనంతో కథ సుఖాంతమైంది. ఆ బాలుడిని గురువారం తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు ఆశ్రమం నిర్వాహకుడు మున్షీ తెలిపారు.