జాతీయ వార్తలు

రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, సెప్టెంబర్ 18: పేదోడు మొదలుకుని డబ్బున్న బడా బాబుల వరకు అందరికీ అందుబాటులో ఉన్న ప్రజారవాణా వ్యవస్థ రైల్వేల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం సికిందరాబాద్ నిరసన వ్యక్తమైంది. అఖిల భారత రైల్వే ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వారం రోజులు నిర్వహించాల్సిన హెచ్చరిక వారం కార్యక్రమంలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బుధవారం సికిందరాబాద్‌లోని సంచలన భవనం ముందు మానహరాన్ని నిర్వహించి, రైల్వే ప్రైవేటీకరణతో ఎదురయ్యే దుష్పలితాలపై ఫొటోప్రదర్శన కూడా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్‌రావు మాట్లాడుతూ నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేల ప్రైవేటీకరణకు శరవేగంగా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రింటింగ్ ప్రెస్‌ను మూసివేశారని ఆరోపించారు. యంత్రాలు, రైల్వే భోగీల తయారీ కేంద్రాలను కూడా నిలిపివేశారని తెలిపారు. అతి త్వరలో తేజెల్ల అనే సంస్థ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు రైల్వేలను ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. ఈ విధానాల వల్ల కేవలం రైల్వే కార్మికులు, సిబ్బందే గాక, సామాన్య ప్రజలు కూడా ఇబ్బందుల పాలవుతారని వివరించారు. ప్రభుత్వం రైల్వే ఉంది కాబట్టే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతున్నాయని, ఈ రకంగా రాజ్యాంగ స్పూర్తిగా విరుద్దంగా అనేక నష్టాలున్నాయన్న విషయాన్ని గుర్తించి, ప్రతి ఒక్కరూ ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ సహాయ కార్యదర్శి శివకుమార్, జోన్ కార్యదర్శి రవీందర్, మజ్దూర్ యూనియన్ నాయకులు బీ.వీ.రెడ్డి, గోవిందరాజులు, స్వరూప, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను వెయ్యి మంది తిలకించినట్లు ఏజీఎస్ శివకుమార్ తెలిపారు.
*చిత్రం...రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నేతలు