జాతీయ వార్తలు

హిందీని రుద్దకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 18: దక్షిణాది రాష్ట్రాలపై హిందీ ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దని కేంద్రానికి వెటరన్ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ హితవు పలికారు. దేశవ్యాప్తంగా ఒకే భాష అనేది అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశమంతటా హిందీని సాధారణ భాషగా ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య తదితరులు కూడా అమిత్ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ విషయంపై బుధవారం ఇక్కడి విమానాశ్రయంలో తనను కలిసిన విలేఖరులతో రజనీకాంత్ మాట్లాడుతూ ఒక దేశానికి ఒకే భాష ఉండాలన్న అభిప్రాయం మంచిదేగానీ అది మన దేశానికి వర్తించదని వ్యాఖ్యానించారు. ఐకమత్యం, అభివృద్ధికి ఒకే భాష ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అన్నారు. అయితే, భారత్ వంటి విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్న పెద్ద దేశాల్లో ఇది సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రత్యేకించి హిందీని అమలు చేస్తామంటే కేవలం తమిళనాడు మాత్రమే కాదు, మరే ఇతర దక్షిణాది రాష్ట్రం కూడా అంగీకరించదు. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా హిందీని వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశమంతటా ఒకే భాష ఉండాలన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీరించే ప్రసక్తే లేదు’ అని 2021 ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించిన సూపర్ స్టార్ అన్నారు. హిందీని దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని అమిత్ షా చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావిస్తూ దేశంలో ఎన్నో రకాల భాషలు ఉన్నాయని, ప్రతి భాషకు ఒక ప్రత్యేక ఉందని స్పష్టం చేశారు. అయితే, దేశానికి ఒక భాష ఉంటే, ఆ గౌరవం మరోలా ఉంటుందని అన్నారు. ఇలావుంటే తమిళనాడులో బీజేపీ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే కూడా అమిత్ షా వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రతికూల ప్రభావాలు పడతాయని వ్యాఖ్యానించింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాత్రం అమిత్ షా ప్రకటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని స్పష్టం చేశారు. బలవంతంగా ఆ భాషను తమపై రుద్దితే సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఒక దేశం, ఒకే భాష విధానంపై సానుకూలంగా స్పందించడం లేదు. కర్నాటకకు ఒక ప్రత్యేక భాష ఉందని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒదులుకోబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. మొత్తమీద దక్షిణాది రాష్ట్రాల్లో అమిత్ షా ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.
*చిత్రం...సూపర్ స్టార్ రజనీకాంత్