జాతీయ వార్తలు

యూపీలో భారీ వర్షాలు : జనజీవనం అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 18: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో గంగ, యమునా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా వారణాసి, అలహాబాద్ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. గంగ, యమునా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. యమునా నది పొంగి పొర్లుతుండడంతో బుందేల్‌ఖండ్ రీజియన్‌తో పాటు హమీర్‌పూర్, బందా, చిత్రకూట్ జిల్లాల్లో పలు ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి. యమునతో పాటు కెన్, బెట్వా నదులు కూడా పొంగి ప్రవహిస్తుండడంతో వేలాది ఎకరాల్లోని పంటలు నీటమునిగాయి. నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిందని బందా జిల్లా మెజిస్ట్రేట్ హిరాలాల్ స్పష్టం చేశారు. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. రహదారులు సైతం తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనేక వంతెనల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం సూచించారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో ఇంతవరకు అధికారిక లెక్కల ప్రకారం 14మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయిల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు.