జాతీయ వార్తలు

ఒకే సంస్థలో పనికి కాలం చెల్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఒకప్పుడు ఎవరికైనా ఉద్యోగం వస్తే, సదరు వ్యక్తి పదవీ విరమణ చేసేంత వరకూ ఆ సంస్థలోనే కొనసాగేవారు. ఆ ఉద్యోగికి, సంస్థకూ మధ్య ఆ విధమైన అనుబంధం ఏర్పడేది. సుదీర్ఘ కాలం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసినప్పుడు తోటి ఉద్యోగులు ఘనంగా సన్మానించే వారు. కానీ కాలం మారింది.
ఒక ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఆ మర్నాటి నుంచే ఇంకా మేలైన ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. ఆ కార్యాలయంలో ఇచ్చే వేతనం కంటే మరో ఉద్యోగానికి వెళితే వేతనం ఎక్కువ లభించడమో, శ్రమ తగ్గడమో, తక్కువ దూరం ఉండడమో, ఇంకా మంచి హోదా లభించడమో ఇలా వేర్వేరు కారణాలై ఉండవచ్చు. ఇది ఎవరో అన్నది కాదు, వాస్తవం అని ఓ సర్వే నివేదిక వెల్లడించింది. పర్షియన్ గ్లోబల్ సర్వే 19 దేశాల్లో 11 వేల మంది ఉద్యోగుల మనోభావాలపై అధ్యయనం చేసింది. భారత్‌లో వెయ్యి మంది ఉద్యోగులపై సర్వే నిర్వహించగా 75 శాతం మంది పదవీ విరమణ చేసేంత వరకూ ఒకే సంస్థలో ఉద్యోగం చేసేందుకు అయిష్టత వ్యక్తం చేశారు.
అంటే దీనిని బట్టి ఒకే సంస్థలో పదవీ విరమణ చేసేంత వరకూ ఉద్యోగం చేయడానికి కాలం చెల్లిందని, అది పాత ‘్ఫ్యషన్’ అని తేలింది. సాంప్రదాయ పదవీ విరమణ లేదిక అని స్పష్టమవుతోంది. అందుకు కారణంలో పాతికేళ్ళ క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, లిమిటెడ్ కంపెనీలు, కార్పోరేషన్లలో ఉద్యోగాలు లభించేవి. ఇప్పుడు కాలం మారింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. వృత్తులూ చాలా వరకు మారాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలూ పుట్టుకుని వచ్చాయి. అనేక కొత్త ఉద్యోగాలకు అవకాశాలు పెరిగాయి. కొత్త ఉద్యోగాలను బట్టి విద్యా విధానంలో మార్పు రావడం జరుగుతూనే ఉంది. దీంతో కొత్త జీవన విధానాలూ వచ్చాయి. ఇందులో భాగంగానే ఉద్యోగాల్లో చేరిన వారూ కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.
భారత్‌లో వెయ్యి మందిపై నిర్వహించిన సర్వేలో 16 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వయస్సు గల వారున్నారు. విద్యా విధానం పట్ల విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేశారు. వృత్తి విద్యా కళాశాలల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా మన దేశంలో విద్యా విధానం ఉందని 59 శాతం మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొంది.
పదవీ విరమణ చేసిన తర్వాత తాము ఖాళీగా ఉండకుండా సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటామని 25 శాతం మంది ఉద్యోగులు తెలిపినట్లు సంస్థ డాటాలో పేర్కొంది. 78 శాతం మంది సాఫ్ట్ వేర్‌కు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉందని అభిప్రాయపడినట్లు ఆ సర్వే సంస్థ పేర్కొంది.