జాతీయ వార్తలు

ఆర్థిక మాంద్యం బాధ్యత మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం బాధ్యత నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తప్పించుకోలేరని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం నాడిక్కడ అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని పేర్కొన్న ప్రియాంక మరో కంపెనీ కూడా ఆర్థిక మాంద్యం గుప్పిట చిక్కుకుందని ఎందరో ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. జీడిపి వృద్ధి రేటు ఐదు శాతానికి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందంటూ ఆర్‌బీఐ గవర్నర్ శశికాంత దాస్ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా తప్పుపట్టారు. వాస్తవాలు మాట్లాడినందుకు గత ఆర్‌బీఐ గవర్నర్లను శిక్షించినట్లుగానే శశికాంత్‌ను కూడా శిక్షిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం దేశ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ప్రస్తుతానికి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ వాస్తవం బయటకు రాక మానదని సూర్జేవాలా అన్నారు.