జాతీయ వార్తలు

దేశ ఐక్యతను చాటే ఎగ్జిబిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ ఐక్యత, శాంతి, సుస్థిరత నెలకొన్నాయని తెలియజెప్పాలన్న ఉద్దేశంతో రాజధాని ఢిల్లీలో ఓ అద్భుతమైన చాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటైంది. ‘నేషనల్ యూనిటీ థ్రో మాన్యూమెంట్స్’ పేరుతో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మంగళవారం ఇక్కడ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
అరుదైన ఫొటోలు ప్రదర్శనలో ఉంచారు. మంగళ డ్యామ్ సరస్సు తీరాన ఉన్న రాంకోట్ కోట, పాకిస్తాన్‌లోని గిల్గిట్‌లోని పురాతన బౌద్ధ క్షేత్రం చిత్రాలు ఉంచారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని పలు చిత్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. మోదీ నాయకత్వాన జాతి ఐక్యత, శాంతి నెలకొన్నాయని చెప్పడానికే ఈ చాయా చిత్ర ప్రదర్శన పెట్టారు. ఢిల్లీలోని నేషనల్ మాన్యూమెంట్ అథారిటీలో దీన్ని ఏర్పాటు చేశారు. పీఓకేలో పురాతన చిత్రాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే జమ్మూకాశ్మీర్, లడఖ్, గుజరాత్‌లోని వాద్‌నగర్ ప్రముఖ సందర్శనీయ స్థలాలు ఇందులో చోటుచేసుకున్నాయి. శంకరాచార్య ఆలయం, కాశ్మీర్‌లోని ప్రఖ్యాత దాల్ సరస్సు, పురాతన రఘునాథ్ ఆలయం ఫొటోలు విపరీతంగా ఆకర్షించాయి. దోగ్రా పాలకుడు మహారాజా గులాబ్ సింగ్ 1835లో రఘునాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడా ప్రాంతం ఆక్రమిత కాశ్మీర్‌లో ఉంది. లడఖ్‌లోని అతిపురాతన లామాయురు ఆరామం చిత్రాలుంచారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చరిత్రలో పదికాలాల పాటు నిలిచిపోయే సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. వాటి గురించి ప్రజలకు తెలియజెప్పడానికి మోదీ జన్మదినోత్సవాన్ని వేదికగా చేసుకోవాలని నిర్ణయించి ఈ అద్భుత చాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. జాతీయ స్ఫూర్తిని పెంపొందించే ఎన్లో దృశ్యాలు పీఓకే, జమ్మూకాశ్మీర్, లడఖ్‌లో ఉన్నాయని మంత్రి ప్రహ్లాద్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ చిన్ననాటి ఫొటోలు ఎగ్జిబిషన్‌లో చోటుచేసుకున్నాయి. అలాగే వాద్‌నగర్‌లోని కీర్తీస్థూపం సందర్శకులకను విపరీతంగా ఆకర్షిస్తోంది. 40 అడుగుల ఎత్తయిన ఈ స్తంభం రెండు పిల్లర్లపై ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రముఖ సందర్శనీయ స్థలాల్లో వాద్‌నగర్ ఒకటి. కీర్తి స్తంభానికి ఓ ప్రత్యేకత ఉంది.‘ మోదీ కీర్తీ తొరాన్‌లో జన్మించారు. అక్కడ స్తంభం సమీంలోనే టీ అమ్మిని బాలుడు ఈనాడు దేశాధినేత అయ్యాడు’అని మంత్రి స్పష్టం చేశారు.