జాతీయ వార్తలు

‘హిందీ’పై పెరుగుతున్న దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు/చెన్నై, సెప్టెంబర్ 16: హిందీని జాతీయ భాషగా అమలు చేయాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన రోజుకో రకమైన రీతిలో తీవ్ర ప్రతిస్పందనలకు దారితీస్తోంది. హిందీని బలవంతంగా రుద్దితే అంగీకరించేది లేదంటూ అనేక రాష్ట్రాలు ఒకదాని తర్వాత మరొకటి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూనే వస్తున్నాయి. తాజాగా కర్నాటక మఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు వైఎఎస్ యడియూరప్ప కూడా హిందీకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ఒకే జాతి, ఒకే భాష అన్న అమిత్ షా ప్రకటనపై స్పందించిన ఆయన కన్నడ భాష విషయంలో రాజీ పడేది లేదని తెగేసి చెప్పారు. అన్ని అధికార భాషలు సమానమేనని ఉద్ఘాటించిన ఆయన ‘కన్నడ మాకు ప్రధాన భాష. దాని ప్రాధాన్యత విషయంలో రాజీ పడేది లేదు. కన్నడ భాషను, రాష్ట్ర సంస్కృతిని బలోపేతం చేస్తాం’ అని అన్నారు.
భారతీయను దెబ్బతీయొద్దు: కమల్‌హాసన్
ప్రముఖ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైన కమల్‌హాసన్ దీనిపై స్పందించారు. హిందీని బలవంతంగా రుద్దితే అంగీకరించేది లేదని తేల్చిచెప్పిన ఆయన ‘ఏ షా, సుల్తాన్ లేదా సామ్రాట్ హిందీని బలవంతంగా అమలు చేయలేరు’ అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారతీయ సంస్కృతిలో భాగమని, దీనిని వమ్ము చేసే యత్నాలు సహించేది లేదని ఆయన అన్నారు. తాము అన్ని భాషలను గౌరవిస్తామని, కానీ తమ మాతృభాష మాత్రం తమిళమేనని కమల్‌హాసన్ అన్నారు. ఇప్పటికే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తదితరులు అమిత్ షా ప్రకటనపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. 2017లో జల్లికట్టుకు అనుకూలంగా జరిగిన నిరసనలను ప్రస్తావించిన కమల్‌హాసన్ ‘అది కేవలం నిరసన మాత్రమే. మా భాషను పరిరక్షించుకునే విషయానికి వస్తే అది చాలా తీవ్రమైన పోరు అవుతుంది’ అని అన్నారు. భారతదేశం అన్నది అన్ని మతాలు, కులాలు, సంస్కృతులు, సంప్రదాయాలు మేళవించిన ఓ మహోన్నత దేశమని, దాని వైవిధ్యాన్ని ఆస్వాదించాలే తప్ప దెబ్బతీయకూడదని ఆయన పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని గురించి ప్రస్తావించిన ఆయన దీనిని బెంగాలీలోనే రాసారని, ఆ భాష చాలామందికి మాతృభాష కాదని తెలిపారు. అయినప్పటికీ ఈ భాషను ప్రతి భారతీయుడు సగర్వంగా ఆలపిస్తాడని ఆయన అన్నారు. ఇందుకు కారణం జాతీయ గీతం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అన్ని భాషలు, సంస్కృతులకు అందులో సముచిత ప్రాధాన్యం ఇవ్వడమేనని కమల్‌హాసన్ తెలిపారు. అందుకే అది ప్రతి ఒక్కరికీ జాతీయ గీతం అయిందని పేర్కొన్న ఆయన సమీకృత భారతాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. ఇటువంటి సంకుచిత ధోరణుల వల్ల భారతీయత అన్న భావనే దెబ్బతింటుంది అని ఆయన అన్నారు.
ఇరకాటంలో బెంగాల్ బీజేపీ!
కోల్‌కతా: హిందీని జాతీయ భాషగా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన పశ్చిమబెంగాల్ బీజేపీ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఆయన ప్రకటనను సమర్ధించాలో లేదా వ్యతిరేకించాలో తెలియక రాష్ట్ర నేతలు మీమాంశలో పడిపోయారు. ఇప్పటికే అధికార తృణమూల్ కాంగ్రెస్ అమిత్ షా ప్రకటనపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు నోరు మెదపలేని స్థితిలో పడిపోయారు. ఒకవేళ ఈ ప్రకటనను తాము సమర్ధిస్తే బెంగాలీ వ్యతిరేకులమంటూ ముద్ర వేస్తారని, ఇదే జరిగితే రాష్ట్రంలో బలపడాలన్న బీజేపీ ప్రయత్నాలు దెబ్బతింటాయని సీనియర్ నేతలు చెబుతున్నారు.
*చిత్రాలు..
కమల్‌హాసన్
*ఒకే దేశం..ఒకే భాష అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా
సోమవారం బెంగళూరులో ధర్నా జరుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు