జాతీయ వార్తలు

అన్ని భాషలకూ సమ ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 16: ‘ఒకే జాతి.. ఒకే భాష’ పేరుతో బలవంతంగా హిందీని దేశ ప్రజలపై రుద్దేందుకు హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలను దాదాపు 50మందికి పైగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ‘అన్ని భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి’, ‘కేవలం ఒక్క భాషను ప్రజలపై రుద్దేందుకు చేసే ప్రయత్నాలను వ్యతిరేకించాలి’ అని సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్ వేదికగా వీరు సోమవారం పిలుపునిచ్చారు. తమ జీవితంలో ప్రధాన భాగమైన బెంగాలీని పక్కనపెట్టి కేవలం హిందీ భాషను మాత్రమే ప్రోత్సహించాలంటూ కేంద్రం చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అమిత్‌షా నిర్ణయాన్ని ఖండించిన ప్రముఖుల్లో కవులు సుబోధ్ సర్కార్, బినాయక్ బందోపాధ్యాయ, ప్రముఖ వక్తలు ఊర్మిల బసు, జగన్నాధ్ బసు, సినీ నిర్మాత ప్రదిప్త భట్టాచార్య తదితరులున్నారు. దేశ వ్యాప్తంగా హిందీ మాట్లాడేవారి శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ భాషనే ప్రధాన భాషగా అమలు చేయాలని కేంద్రం ప్రకటన చేసిన రెండు రోజుల తరువాత బెం గాల్ మేధావులు స్పందించారు. తమ జీవనంలో అంతర్లీనమైన మాతృభాష బెంగాలీని పక్కన పెట్టాలని యోచిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మా సొంత భాష, మా మాతృ భాష, మాకెంతో ప్రియమైన బెంగాలీ భాషను ప్రమాదంలో పడేసే విధంగా చేపట్టే ఎలాంటి చర్యలనైనా ప్రతిఘటించి తీరుతామని అన్నారు. ‘నాకు హిందీ భాష అంటే ఎంతో గౌరవం.. అయితే దానితో సమానంగా మలయాళీ, మరాఠీ, కొంకణిలతో పాటు దేశ ప్రజలంతా మాట్లాడే వారి వారి మాతృ భాషలన్నింటినీ గౌరవిస్తాం’ అని సుబోధ్ సర్కార్ పేర్కొన్నారు. ‘ఏ భాషా ఎక్కువా కాదు.. అలాగని తక్కువా కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘విభిన్న భాషలకు భారతదేశం ఖ్యాతి గాంచింది.. కానీ మాతృ భాష అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో తమ రేషన్ కార్డుగా మారిపోయింది’ అన్న సంగతిని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఉన్నట్టుండి ఆయనకు (అమిత్ షా) ఏమైంది.. రాత్రికి రాత్రి ‘ఒకే దేశం.. ఒకే భాష’ నినాదాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు. దీనిపై తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయన్న సంగతిని కేంద్రం గమనించాలనీ.. ప్రతిపాదిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బెంగాలీ ప్రముఖులు డిమాండ్ చేశారు.