జాతీయ వార్తలు

కాళేశ్వరం అనుమతులపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులకు సంబంధించిన నివేదికలను వారం రోజుల్లోగా సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, అభ్యంతరాలుంటే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదికను సమర్పించాలని ఆ రాష్ట్రాన్ని ఎన్జీటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులు చెల్లవంటూ హయాతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ సోమవారం విచారణ జరిపింది. గతంలో నివేదికలను సమర్పించాలని ఆదేశించినా ఇప్పటికీ సమర్పించకపోవడంపై ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలను సమర్పించేందుకు సమయం కావాలని న్యాయవాదులు కోరడంతో.. వారంలోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.