జాతీయ వార్తలు

పక్షపాతం లేకుండా సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్ (యూపీ), సెప్టెంబర్ 16: తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఎటువంటి పక్షపాతం లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకూ అందిస్తామని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కాన్పూర్‌లో రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 50 పథకాలకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ తాము అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొందని, ఎక్కడా అల్లర్లు జరగడం లేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం ఉండేదని ఆయన చెప్పారు. కాన్పూర్ కోల్పోయిన ప్రాభవాన్ని పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. నగరానికి ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు కల్పించామని ఆయన వివరించారు. ఇంకా త్వరలో నమామీ గంగా ప్రాజెక్టు కింద గంగా ఘాట్లను సుందరీకరణ చేస్తామన్నారు. కాన్పూర్ ప్రజలకు మెట్రో రైళ్ళలో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామన్నారు. అయితే నగర ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు. ఏప్రిల్, మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మళ్లీ పట్టం కట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంపై ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆయన అభినందించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కలిసి ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపుతున్నారని ఆయన తెలిపారు.