జాతీయ వార్తలు

18న మోదీతో మమత భేటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 16: కేంద్రం, పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి అనేక అంశాల్లో సంఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని బెంగాల్ సచివాలయ వర్గాలు ధృవీకరించాయి. బెంగాల్‌కు సంబంధించిన పాలనాపరమైన అంశాలపైనే వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని ఈ వర్గాలు తెలిపాయి. బెంగాల్ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌పై సీబీఐ దాడులు జరపడం, బీజేపీ, తృణమూల్ మధ్య ఘర్షణ వాతావరణాన్ని మరింత పెంచాయి. ముఖ్యంగా శారదా, పోంజీ కుంభకోణం విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.