జాతీయ వార్తలు

నిస్వార్థంగా సేవలందించిన మహానీయుడు బూర్గుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నిస్వార్థంగా సేవలందించిన మహానీయుడు బూర్గుల రామకృష్ణారావు అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బూర్గుల రామకృష్ణారావు 52వ వర్థంతినిపురస్కరించుకుని లిబర్టీ చౌరస్తా వద్దనున్న బూర్గుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీ, సీపీఆర్‌ఓ వెంకటరమణ దత్తాత్రేయకు అధికారికంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ బూర్గుల ఉత్తర్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా సేవలందించారని గుర్తుచేశారు. బూర్గుల బహుబాషా ప్రావిణ్యలే గాక, సేవా నిరతి కల్గిన గొప్ప వ్యక్తిత్వం అని కొనియాడారు.
మంచి పరిపాలన దక్షుడే గాక, ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని గుర్తుచేశారు. బూర్గుల రామకృష్ణారావు ఫౌండేషన్ చైర్మన్ డా.బి.బాబురావువర్మ మాట్లాడుతూ పాలమూరు విశ్వవిద్యాలయానికి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. కార్యక్రమం లో తెలంగాణ జన సమి తి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, బూర్గుల నర్సింగ్‌రావు, చంద్రప్రకాశ్, లక్ష్మికాంత్ పాల్గొన్నారు.
*చిత్రం... బూర్గుల రామకృష్ణారావుకు నివాళి అర్పిస్తున్న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు