జాతీయ వార్తలు

యాపిల్ అమ్మకాలను అడ్డుకున్నారో జాగ్రత్త: కాశ్మీర్ గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, సెప్టెంబర్ 14: కాశ్మీర్ మిలిటెంట్లను పాక్‌కు అమ్ముడుపోయిన వ్యక్తులుగా అభివర్ణించిన రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ యాపిల్ రైతులను అడ్డుకుంటే తీవ్ర పర్యవసనాలు ఎదురవుతాయని వారిని హెచ్చరించారు. కాశ్మీర్ లోయ ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్న రైతులను మిలిటెంట్లు బెదిరిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఈ హెచ్చరిక చేశారు. పాక్ చెప్పుచేతల్లో పని చేస్తున్న కొంత మంది ఆపిల్ ఉత్పత్తిదారులను చంపేస్తామని బెదిరిస్తున్నారని కాశ్మీర్ లోయ వెలుపలి మార్కెట్లలో వీటిని విక్రయించవద్దని హెచ్చరిస్తున్నారని గవర్నర్ అన్నారు. మిలిటెంట్లు తమ ధోరణిని మార్చుకోకపోతే ఆపిల్ ఉత్పత్తిదారులే మరణిస్తారో లేక మిలిటెంట్లే మరణిస్తారో నేను చెప్పలేను అని అన్నారు. ఈ మాటల ద్వారా ఉగ్రవాదులకు తీవ్ర స్థాయిలో హెచ్చరిక సంకేతాలు అందించారు.