జాతీయ వార్తలు

ఉగ్రవాదం వీడకపోతే పాక్ విచ్ఛిన్నమే: రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, సెప్టెంబర్ 14: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ధోరణిని పాకిస్తాన్ కట్టిపెట్టాలని, లేనిపక్షంలో అది విచ్ఛిన్నం కావడం ఖాయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం నాడిక్కడ అన్నారు. విధి నిర్వహణలో మరణించిన 120 మంది సైనిక కుటుంబాలను సత్కరించేందుకు జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ‘పాకిస్తాన్ ప్రజలు ఆధీన రేఖను దాటి వస్తే భారత్ సైన్యం మళ్లీ వారిని వెనక్కి పంపదు’ అని అన్నారు. అందుకే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధీన రేఖను దాట వద్దంటూ తమ పౌరులకు మంచి హెచ్చరికే చేశారని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370-రాజ్యాంగ అధికరణ రద్దు కావడం పాకిస్తాన్‌కు మింగుడు పడలేదని అందుకే దీనిపై ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందన్నారు. పాక్ ఎంతగా మొత్తుకుంటున్నా ప్రపంచ దేశాలు దాని మాట ఏ మాత్రం ఖాతరు చేయలేదని రాజ్‌నాథ్ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మైనారిటీ జనాభా పెరిగిందని, అదే పాకిస్తాన్‌లో సిక్కులు, బౌద్ద మతస్థులు ఇతరులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌లోని మైనారిటీలు సురక్షితంగా ఉన్నారని, సురక్షితంగానే ఉంటారని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. కులం లేదా మతం పేరిట దేశంలో జనాభా విభజన జరగదని పేర్కొన్న ఆయన ‘పాకిస్తాన్‌ను ఎవరూ విచ్చిన్నం చేయాల్సిన అవసరం లేదు, దానంతట అదే విచ్చిన్నం అయిపోతుంది’ అని రాజ్‌నాథ్ అన్నారు. ఉగ్రవాదాన్ని ఆపని పక్షంలో పాక్ విచ్ఛిన్నాన్ని ఎవరూ ఆపలేరన్నారు. సైనిక యోధుల కుటుంబాలను సన్మానించిన రాజ్‌నాథ్ ఒక్కో కుటుంబానికి రెండున్నర లక్షల పరిహారాన్ని అందించారు.