జాతీయ వార్తలు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్లు నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్లుగా ముగ్గురు దక్కించుకున్నారు. వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి, జాతీయ పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు, రవాణా, టూరిజం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ నియమితులయ్యారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయ సాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీలో సభ్యులుగా లోక్‌సభ నుంచి టీడీపీ ఎంపీ కేశినేని నాని, టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. రాజ్యసభ నుంచి టీడీపీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. అలాగే హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ నుంచి వంగా గీత, టీఆర్‌ఎస్ నుంచి పొతుగంటి రాములు ఎంపికయ్యారు. మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా వైసీపీ
నుంచి లావు శ్రీకృష్టదేవరాయలు నియామితులయ్యారు. జాతీయ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు.. సభ్యులుగా వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్‌రెడ్డి నియామితులయ్యారు. శాస్త్ర సాంకేతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టీఆర్‌ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. రవాణా, పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా టీజీ వెంకటేష్.. సభ్యులుగా వైసీపీ ఎంపీ గొడ్డెటి మాధవి, బీజేపీ నుంచి ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు. సిబ్బంది వ్యవహారాలు న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా టీఆర్‌ఎస్ ఎంపీ బి.లింగయ్య యాదవ్ నియమితులయ్యారు. వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా వైసీపీ సభ్యుడు పి.బ్రహ్మానందరెడ్డి నియమితులయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలిజీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా టీఆర్‌ఎస్ ఎంపీ గెడ్డం రంజిత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఉన్నారు. రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, వైసీపీ సభ్యుడు కోటగిరి శ్రీధర్, కాంగ్రెస్ సభ్యుడు టీ.సుబ్బరామిరెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ వీ.లక్ష్మీకాంతారావు ఉన్నారు. విద్యుత్ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. విదేశాంగ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, టీఆర్‌ఎస్ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ ఎంపీ సోయం బాబురావు ఉన్నారు. ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీలో వైసీపీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, పీవీ మిథున్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ ఉన్నారు. ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ స్టాండింగ్ కమిటీలో టీఆర్‌ఎస్ ఎంపీ మనె్న శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ ఎంపికయ్యారు. పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైసీపీ నుంచి చింతా అనురాధ, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైసీపీ ఎంపీ ఎన్.రెడ్డప్ప, కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్, బీజేపీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ఉన్నారు. పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీలో వైసీపీ ఎంపీ అదాల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఉన్నారు. జల వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్సాసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నియమితులయ్యారు. గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైసీపీ ఎంపీ తలారి రంగయ్య, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. బొగ్గు ఉక్కు శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎంపికయ్యారు. సామాజిక న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ నియమితులయ్యారు.

*చిత్రాలు.. విజయ సాయిరెడ్డి, కే.కేశవరావు