జాతీయ వార్తలు

దేశ వ్యాప్త ఉద్యమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: హిందీని బలవంతంగా రుద్దితే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే కేంద్రాన్ని హెచ్చరించింది. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటనపై విరుచుకుపడ్డ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ‘ భారతదేశం ఇండియానా లేదా హిందీయానా’ అని ప్రశ్నించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం నిజమైన శక్తి అని రాజ్యాంగం గుర్తించిందని ఆయన తెలిపారు. దేశంలో హిందీ భాష మాట్లాడని పౌరులను ద్వితీయ పౌరులుగా ప్రకటించాలన్న ఆలోచన అమిత్ షా ప్రకటనలో కనిపిస్తోందని ఆయన అన్నారు.

చిత్రం... డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్