జాతీయ వార్తలు

ఇది మాపై రుద్దడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: హిందీని ఉమ్మడి భాషగా మార్చాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపు రాజకీయ రంగును సంతరించుకుంది. అమిత్ షా ప్రకటనను హిందీ భాషను దక్షిణాదిపై రుద్దడంగా కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అభివర్ణించారు. అయితే, అధికార బీజేపీ మాత్రం కన్నడ భాష మాదిరిగానే హిందీని నేర్చుకోవాలంటూ సమర్ధించింది. అమిత్ షా ప్రకటనను హిందీ భాషను కర్నాటకపై రుద్దడంగా భావించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హిందీ జాతీయ భాష అన్న అబద్ధపు ప్రచారాన్ని కట్టిపెట్టాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కన్నడ భాషలాగే దేశంలోని 22 అధికార భాషల్లో హిందీ కూడా ఒకటన్న వాస్తవాన్ని విస్మరించకూడదని ఆయన స్పష్టం చేశారు. అబద్ధాలు, తప్పుడు సమాచారంతో ఓ భాషను అభివృద్ధి చేయజాలరని పేర్కొన్న ఆయన ప్రజల మధ్య ఆప్యాయత, గౌరవాలను బట్టే భాషలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. దేశవ్యాప్తంగా కన్నడ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశ్నించారు. కేంద్రం హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటోందని, రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఒకటైన కన్నడ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారని ఆయన ప్రశ్నించారు.