జాతీయ వార్తలు

మోదీ బహుమతుల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ప్రధాని నరేంద్ర మోదీకి వేర్వేరు సందర్భాల్లో లభించిన 2,700 బహుమతులను (మెమోంటోలు, గిఫ్టులు) వేలం వేయడం ప్రారంభమైంది. కాబట్టి మీరూ త్వరపడండి. వచ్చే నెల 3వ తేదీ వరకే ఈ ఛాన్స్ ఉంటుంది. మోదీ బహుమతుల వేలాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ‘నమామి గంగా ప్రాజెక్టు’కు నిధులు సమకూర్చేందుకే ప్రధాని మోదీకి లభించిన బహుమతులను వేలం వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రదర్శనతో పాటు ఈ-ఆక్షన్‌ను ఆయన ప్రారంభించారు. ఏడాది కాలంలో లభించిన ఈ బహుమతులను వచ్చే నెల 3వ తేదీ వరకు వేలం వేయడం జరుగుతుందన్నారు. 2,700 వస్తువుల్లో మెమెంటోలతో పాటు శాలువలు, పగిరి(పగిడి) లు, పెయింట్‌ంగులు, జాకెట్లు ఇతరత్రా ఉన్నట్లు ఆయన వివరించారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడ్రన్ ఆర్ట్ (ఎన్‌జిఎంఏ)లో ‘స్మృతి చిహ్నం’ పేరిట 500 మెమెంటోలు సందర్శకుల కోసం పెట్టామన్నారు. ఇక్కడ ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చని, ఖరీదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఇక్కడ రూ.200 నుంచి రూ.2.5 లక్షల వరకు ధర ఉంటాయని వివరించారు. ప్రజలు ముందుకు వచ్చి వేలంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానించారని ఆయన చెప్పారు. ఢిల్లీలోని ఇండియా గేటుకు సమీపంలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడ్రన్ ఆర్ట్‌లో వీటిని వచ్చే నెల 3వ తేదీ వరకు వేలం వేయనున్నందున ప్రజలు పాల్గొనాలని ప్రధాని కోరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. గతంలో ఏ ప్రధాని కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకోలేదని మంత్రి పటేల్ అన్నారు. కేంద్రానికి చెందిన నమామీ గంగా ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాలన్న సదుద్దేశ్యంతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.
చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ